ఆరు జట్లతో మహిళల ఐపీఎల్‌ కావాలి!

19 Aug, 2021 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: అమ్మాయిలకు ఆరు జట్లతో ఐపీఎల్‌ నిర్వహిస్తే జాతీయ జట్టు బలంగా తయారవుతుందని, రిజర్వ్‌ బెంచ్‌ సత్తా పెరుగుతుందని భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన అన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 25 ఏళ్ల ఓపెనర్‌ మాట్లాడుతూ ‘ఐపీఎల్‌ ఆరంభంతో పురుషుల జట్లు అద్భుత పురోగతి సాధించాయి. నాణ్యమైన క్రికెటర్లతో జట్ల బలం, రిజర్వ్‌ బలం కూడా పెరిగింది. చెప్పాలంటే పది పదకొండేళ్ల క్రితం ఉన్నట్లుగా ఇప్పుడు జట్లు లేవు.

పురుష క్రికెటర్లు అనూహ్యంగా పుంజుకుంటే మహిళా క్రికెటర్లు అక్కడే ఉన్నారు. అలా కాకుండా అమ్మాయిలకు ఐపీఎల్‌ ఉండివుంటే మా పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఇప్పటికైనా ఐదారు జట్లతో మహిళల ఐపీఎల్‌ నిర్వహిస్తే కచ్చితమైన మార్పు కనిపిస్తుంది. తగినంత మంది ప్లేయర్లు కూడా మన వద్ద ఉన్నారు. ఆదరణను బట్టి జట్ల సంఖ్యను పెంచాలనేదే నా సూచన’ అని ఆమె తెలిపింది. ఆస్ట్రేలియాలో ఉమెన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ వల్ల మహిళా క్రికెటర్ల బెంచ్‌ పరిపుష్టిగా ఉందని మంధాన చెప్పింది.

>
మరిన్ని వార్తలు