గా ముంబైల అందరు బ్యాట్స్‌మెన్లే.. ఎందర్నని ఔట్‌ జేయాల్రా!

9 Apr, 2021 12:33 IST|Sakshi
ఆర్సీబీ ఆటగాళ్ల బృందం(ఫొటో కర్టెసీ: ఆర్సీబీ సోషల్‌ మీడియా)

ముంబై వర్సెస్‌ ఆర్సీబీ: సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ రచ్చ! 

వైరల్‌ అవుతోన్న వీడియో

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే వినోదానికి మారుపేరు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లీగ్‌ మ్యాచ్‌లు ఉన్నా ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. దేశం తరఫున ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్లు లీగ్‌లో మాత్రం ప్రత్యర్థులుగా మారి సై అంటే సై అంటూ మైదానంలోకి దిగుతారు. పొట్టి ఫార్మాట్‌లో ఉండే అసలైన మజాను పంచుతారు. అందుకే ఐపీఎల్‌ వచ్చిందంటే క్రికెట్‌ అభిమానులకు పండుగే. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వారు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేడు ఈ మెగా ఈవెంట్‌ మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే రకరకాల మీమ్స్‌, వీడియోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇందులో భాగంగా, తొలి మ్యాచ్‌లో తలపడే ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్యాన్స్‌ రెండు గ్రూపులుగా విడిపోయి సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఐదుసార్లు టైటిల్‌ సాధించిన జట్టుగా ముంబైకి రికార్డు ఉండగా, ఈసారైనా విజేతగా నిలిచి చిరకాల కోరిక నెరవేర్చుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతోంది.ఈ నేపథ్యంలో నెటిజన్లు రకరకాల స్పూఫ్‌ వీడియోలు వెలుగులోకి తెస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి తెలుగులో మాట్లాడుతూ తన జట్టుకు ఎలా నిర్దేశం చేస్తున్నాడో చూడండి అంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

చదవండి: IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్‌ కాబోతోందా?!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు