ఒక్కొక్కరూ క్యూకట్టేస్తుంటే కావ్య మారన్‌ కంటతడి!

15 Apr, 2021 20:37 IST|Sakshi
Photo Coutesy:Twitter

చెన్నై:  కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ కోల్పోతే ఎలా ఉంటుంది. అది సగటు క్రీడాభిమానికే చిరాకు తెప్పిస్తుంది. మరి అటువంటిది ఆ జట్టు సీఈవో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అప్పటివరకూ ఫేవరెట్‌గా ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక్కసారిగా కుదేలవడాన్ని ఆ ఫ్రాంచైజీ సీఈవో కావ్య మారన్‌ జీర్ణించుకోలేకపోయారు. సన్‌రైజర్స్‌  ఆటగాళ్లలో ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూకడుతుంటే డగౌట్‌లో ఉన్న కావ్య మారన్‌ కంటతడి పెట్టుకున్నారు.  ఆమెది ఏమీ చేయలేని పరిస్థితి.  అయ్యో.. జట్టు ఇలా ఓటమి వైపు పయనిస్తుందని అనుకోవడం తప్పితే ఏం చేస్తారు. ఈ క‍్రమంలోనే ఆమెను అనుసరించాయి కెమెరాలు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

చెన్నైకి చెందిన సన్ నెట్‌వర్క్ చీఫ్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీఈవో కూడా ఆమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గ్రౌండ్‌లో దర్శనమిస్తూ టీమ్‌ను కావ్య మారన్ ప్రోత్సహిస్తుంటారు. ఆదివారం ఎస్ఆర్‌హెచ్ – కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు…నిన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(ఆర్సీబీ) మ్యాచ్‌లోనూ కెమెరా కళ్లన్నీ ఆమె వైపే ఉన్నాయి.మ్యాచ్‌ సందర్భంగా ఆడియన్స్ మధ్య కూర్చొన్న ఆమె హావభావాలను క్యాచ్ చేసేందుకు కెమెరామెన్లు పోటీపడ్డారు.

ఆమె తొలిసారి 2018 సీజ‌న్ ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ్యాచ్‌లో కనిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో స‌న్‌రైజ‌ర్స్ టేబుల్ ద‌గ్గ‌ర క‌నిపించేసరకి ఆ అమ్మాయి పైకే కెమెరాలు అదే పనిగా జూమ్ చేశాయి. ఈ ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెన‌ర్ గిల్‌ను ర‌షీద్ అవుట్ చేయ‌గానే కావ్య సెల‌బ్రేట్ చేసుకుంటుండగా కెమెరా ఆమె వైపుకు తిప్పారు. అలా మళ్లీ తెరపైకి వచ్చింది. మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన రెండో మ్యాచ్‌లో ఇలా కనిపించారు కావ్య మారన్‌.

ఇక్కడ చదవండి: అతనికి కోహ్లి ఒక గొప్ప ఆస్తి: బ్రెట్‌ లీ

RCB VS SRH‌: అరిచి అరిచి నా గొంతు పోయింది

మరిన్ని వార్తలు