ముత్తయ్య మురళీధరన్‌ డిశ్చార్జి

20 Apr, 2021 08:48 IST|Sakshi

చెన్నై, సాక్షి: శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. 49 ఏళ్ల మురళీధరన్‌కు ఆదివారం అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌ జి.సెంగోత్తువేలు యాంజియాప్లాస్టీ నిర్వహించి స్టెంట్‌ను అమర్చారు. సోమవారం డిశ్చార్జి అయిన మురళీధరన్‌ సాధారణ జీవితాన్ని గడపవచ్చని ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడు రోజుల క్వారంటైన్‌ తర్వాత మురళీధరన్‌ మళ్లీ సన్‌రైజర్స్‌ జట్టుతో కలవనున్నాడు.    

శ్రీలంక క్రికెటర్‌ దిల్హారాపై ఎనిమిదేళ్ల నిషేధం 
అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్‌ దిల్హారా లోకుహెట్టిగేపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2017లో యూఏఈలో జరిగిన టి20 టోర్నీలో శ్రీలంకకు చెందిన ఓ జట్టు పాల్గొంది. ఈ టోర్నీ సందర్భంగా దిల్హారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఐసీసీ విచారణలో తేలింది. 40 ఏళ్ల దిల్హారా 2016లో రిటైరయ్యాడు. శ్రీలంక తరఫున తొమ్మిది వన్డేల్లో, రెండు టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.    

చదవండి: ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ

మరిన్ని వార్తలు