జేసన్‌ హోల్డర్‌ వచ్చేశాడు..

5 Apr, 2021 18:19 IST|Sakshi
జేసన్‌ హోల్డర్‌ (ఫోటో కర్టసీ ; ట్వీటర్‌/ఎస్‌ఆర్‌హెచ్‌)

చెన్నై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పాల్గొనడానికి వెస్టిండిస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ భారత్‌లో అడుగుపెట్టాడు. సోమవారం చెన్నైకు చేరుకున్న హోల్డర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుతో కలిశాడు. కాగా, వారం రోజులు క్వారంటైన్‌ ఉండి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే ఎస్‌ఆర్‌హెచ్‌ స్వ్కాడ్‌లో కలుస్తాడు. ఈ నెల11వ తేదీన చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కేకేఆర్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గత సీజన్‌ లో ఆరంభంలో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన హోల్డర్‌.. దాదాపు సగం సీజన్‌ అయినపోయిన తర్వాత నుంచి వరుసగా తుది జట్టులో అవకాశం దక్కించుకుని ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  ఫలితంగా ఈ ఏడాది కూడా హోల్డర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.   

డెక్కన్‌ చార్జర్స్‌ నుంచి సన్‌రైజర్స్‌గా పేరు మార్చకున్న తర్వాత 2016లో టైటిల్‌ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రతీ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్‌కు చేరుకున్న జట్టుగా నిలిచింది. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో కేన్‌ విలియమ్స్‌న్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌ సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరఫ్‌గా నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌  బలమంతా కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వార్నర్‌ తర్వాత బెయిర్‌ స్టో, విలియమ్సన్‌, మనీష్‌ పాండేలు స్టార్‌ ఆటగాళ్లు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, రషీద్‌ ఖాన్‌, హోల్డర్‌లు కీలకం.  గత సీజన్‌లో వార్నర్‌ సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఎన్నో కష్టాలు దాటుకుంటూ ప్లే ఆఫ్‌కు చేరుకున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. ఈసారి వేలంలో కేదార్‌ జాదవ్‌ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ ఆటగాళ్లను ఎవరిని కొనుగోలు చేయలేదు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ స్వ్కాడ్‌ ఇదే..

పొలార్డ్‌ను మరిపిస్తున్నాడు.. ఆ సాహసం చేయలేను: కుంబ్లే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు