ఎందుకు విమర్శించారో నాకైతే అర్థం కాలేదు

4 May, 2021 18:53 IST|Sakshi

ఢిల్లీ:  టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్‌. గత కొన్నేళ్లుగా జడేజాపై వస్తున్న విమర్శలకు ఈ ఐపీఎల్‌లో తన ఆల్‌రౌండ్‌ షో సమాధానం చెప్పాడని స్టైరిస్‌ కొనియాడాడు.  ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన స్టైరిస్‌.. విదేశీ ఆటగాళ్ల కోణంలో నేను చెబుతున్నా. రవీంద్ర జడేజాపై విమర్శలు ఎందుకు వచ్చాయో నాకైతే అర్థం కాలేదు.

అతనొక అసాధారణ క్రికెటర్‌. టాప్‌ లెవెల్‌ ఉన్న ఏ క్రికెటర్‌కు అతను తీసిపోడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఎక్కడైనా జడేజా సత్తాచాటగలడు. ఈ ఐపీఎల్‌లో అది రుజువైంది. అతని ఫీల్డింగ్‌ సామర్థం మరొక స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం వరల్డ్‌ క్రికెట్‌లో జడేజా అత్యుత్తమ ఫీల్డర్‌. నేను జడేజాను బ్యాటింగ్‌లో ప్రమోట్‌ చేయమని గతేడాది నుంచి చెబుతున్నా. ఈ ఏడాది అతన్ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేసింది సీఎస్‌కే. ఒక కచ్చితమైన బ్యాట్స్‌మన్‌ జడేజా. పొలార్డ్‌, హార్దిక్‌, ఏబీ డివిలియర్స్‌ స్థాయి క్రికెటర్‌ జడేజా’ అని ప్రశంసించాడు. 

మరిన్ని వార్తలు