ఆరెంజ్‌ ఆర్మీ ఉగాది శుభాకాంక్షలు వింటే నవ్వులే నవ్వుల్‌..

13 Apr, 2021 17:14 IST|Sakshi

చెన్నై: తెలుగు వారు నూతన సంవత్సరంగా ఆచరించే 'ఉగాది' పర్వదినాన్ని పురస్కరించుకుని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సన్‌రైజర్స్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వీడియోను ఫ్రాంఛైజీ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు తెలుగులో శుభాకాంక్షలు తెలియజేసిన విధానం అభిమానుల్లో నవ్వుల పువ్వులు పూయించింది. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ మినహా మిగతా వారి విషస్‌ వింటే కడుపు చెక్కలు అయ్యేలా నవ్వడం ఖాయం. వచ్చీ రానీ తెలుగులో వారు చేసిన ప్రయత్నం నవ్వులు పూయించడంతో పాటు అందరినీ ఆకట్టుకుంది. 

కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో సహా ప్రతి ఒక్క ఆటగాడు తమ అభిమానులకు 'ఉగాది శుభాకంక్షాలు' తెలిపారు. 'ఆరెంజ్‌ ఆర్మీ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు' అనే క్యాప్షన్‌ జోడించి సన్‌రైజర్స్ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు