ఏంటి సూర్య.. డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్స్‌ బయటపెడతారా

8 Apr, 2021 16:20 IST|Sakshi

చెన్నై: ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తమ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉండే సీక్రెట్స్‌ను బయటపెట్టాడు. అదేంటి సూర్య అలా ఎందుకు చేశాడని అనుమానం కలుగుతుందా. అయితే ఇది ఫన్నీ తరహాలో మాత్రమే తీసుకొండి. అసలు విషయంలోకి వెళితే.. సూర్యకుమార్‌ తన సహచరులైన పాండ్యా, పొలార్డ్‌, ఇషాన్‌ కిషన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎలా ఉంటారనే దానిపై ఇంటర్య్వూలో ఫన్నీగా పేర్కొన్నాడు.

''ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ నాకు ఎప్పుడు వింతగా కనిపిస్తుంది. నేను ఆ జట్టు ఆటగాడినే అయినా నాకు కొంత మంది ప్రవర్తనలు నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఆటగాళ్లు ఉంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎప్పుడు ఫన్నీ వాతావరణమే కనిపిస్తుంది. అయితే వారిని ఇంకో కోణంలో చూస్తే కచ్చితంగా షాక్‌ అవుతారు. మ్యాచ్‌ గెలిచినా.. ఓడినా వీరు ముగ్గురు ఫన్నీగానే ఉంటూ మమ్మల్ని సంతోషపెడుతారు. ఉదాహరణకు మ్యాచ్‌ గెలిస్తే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆహ్లదకర వాతావరణం ఉంటుంది.. ఒకవేళ మ్యాచ్‌ ఓడిపోయినా అదే విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. అలా కాకుండా ఓడినా.. గెలిచినా ఒకే తరహాలో ఉంటే ప్రతీ మ్యాచ్‌కు ఉత్సాహంగా బరిలోకి దిగొచ్చు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే సూర్య డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్స్‌ రివీల్‌ చేయడంపై ఫ్యాన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ చేశారు. ఏంటి సూర్య.. డ్రెస్సింగ్‌రూమ్‌ సీక్రెట్స్‌ బయటపెడతారా ఎవరైనా.. అంటూ కామెంట్స్‌ చేశారు. కాగా ఇప్పటికే ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ వరుసగా హ్యాట్రిక్‌ టైటిల్‌(2019, 2020)ను సాధించాలని ఉ‍వ్విళ్లూరుతుంది. ముంబై జట్టులో ఉన్న రోహిత్‌ సహా సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌, బుమ్రాలు మంచి ఫామ్‌లో ఉండడం సానుకూలాశంగా మారింది. కాగా ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 9న చెన్నై వేదికగా ఆర్‌సీబీతో ఆడనుంది.
చదవండి: 'బడ్డీ.. ఎందుకంత కోపం! ఆ నవ్వు ఎక్కడ'

'గేల్‌ ఫిట్‌నెస్‌లో నాకు సగం వచ్చినా బాగుండు'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు