IPL 2021 CSK Vs KKR: అప్పుడు టార్గెట్‌ 190/3, ఇప్పుడేమో.. 192/3!

15 Oct, 2021 22:22 IST|Sakshi
PC: IPL/ BCCI

IPL 2021 FInal: ఐపీఎల్‌-2021 విజేతగా నిలిచేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(32), డుప్లెసిస్‌(86) శుభారంభం అందించగా... రాబిన్‌ ఊతప్ప తనకు దక్కిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మొయిన్‌ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన 3 వికెట్లు కోల్పోయి... 192 పరుగులు చేసింది. 

ఇక లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా.... 6 ఓవర్లు ముగిసేసరికి 55 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. ఇదిలా ఉండగా... ఐపీఎల్‌ విజేత ఎవరన్న అంశంపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. దుబాయ్‌ పిచ్‌ హిస్టరీ, అదే విధంగా గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన సమయంలో కేకేఆర్‌ 180 కంటే ఎక్కువ టార్గెట్‌ ఛేజ్‌ చేసిన నేపథ్యంలో మోర్గాన్‌ బృందానికే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక 2012లో చెన్నైలో సీఎస్‌కేతో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో కేకేఆర్‌ 192(19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) పరుగులు చేసి టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2014లో బెంగళూరులో జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌తో తలపడిన కోల్‌కతా 200(19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరుగులు సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు కూడా 2012 నాటి ఫలితమే పునరావృతమవుతుందని కేకేఆర్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తలా ధోని అభిమానులు సైతం... ‘‘ఇక్కడ ఉంది మిస్టర్‌ ధోని.. అది గుర్తుంచుకోండి’’ అంటూ ధీటుగా బదులిస్తున్నారు. 

2012 ఫైనల్‌ స్కోర్లు
చెన్నై... 190-3 (20 ఓవర్లు)
కేకేఆర్‌.... 192-5 (19.4 ఓవర్లు)
విజేత: కోల్‌కతా

2021 ఫైనల్‌
చెన్నై: 192-3 (20 ఓవర్లు)
విజేత... ?

Poll
Loading...
మరిన్ని వార్తలు