పాపం  బౌల్ట్‌.. బంతిని పట్టుకోలేక

18 Apr, 2021 14:51 IST|Sakshi
Photo Courtesy: Twitter

చెన్నై: క్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌లే కాదు.. కొన్ని సందర్భాల్లో ఫీల్డర్ల విన్యాసాలు నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ చేసిన ఫీల్డింగ్‌ కాసేపు నవ్వులు తెప్పించినా అయ్యో పాపం అని కూడా అనిపించింది. అసలు ఫీల్డింగ్‌ చేస్తూ అలా తూలిపోతున్నాడేంటి అని మ్యాచ్‌ చూసిన చాలామంది అభిమానులు అనుకున్నారు. బ్యాలెన్స్‌ చేసుకోలేక, బంతిని పట్టుకోలేక ఇలా బౌల్ట్‌ ఆగమేగమయ్యాడు బౌల్ట్‌. కృనాల్‌ పాండ్యా వేసిన ఒక ఓవర్‌లో ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ వార్నర్‌ షాట్‌ ఆడాడు.  అది కవర్స్‌ మీదుగా ఫోర్‌ బౌండరీకి దూసుకెళ్లే క్రమంలో బౌల్ట్‌ దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు.

ముందు బంతి, వెనుకాల బౌల్ట్‌.. కానీ చివరకు బంతికి ఫోర్‌కు పోయింది. ఆ బంతిని ఆపడానికి డైవ్‌ కొడదామనే ఆలోచన రాగానే బౌల్ట్‌ అదుపు తప్పాడు. అంతే బ్యాలెన్స్‌ చేసుకోలేక నానా అగచాట్లు పడ్డాడు. చివరకు కాస్త స్థిమిత్తంగానే కింద పడటంతో ఎటువంటి గాయం కాలేదు.  కాకపోతే ఇటీవల చెన్నై బీచ్‌లో సర్ఫింగ్‌ చేసిన బౌల్ట్‌కు అక్కడ విన్యాసాలు ఏమైనా గుర్తుకొచ్చాయేమనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌కే చెందిన జిమ్మీ నీషమ్‌ అయితే తన సహచర క్రికెటర్‌ ఇలా ఫీల్డింగ్‌లో విఫలవడంపై తనకు ఫ్రతీ ఒక్కరూ వారి యొక్క బెస్ట్‌ జిఫ్‌లను పంపాలని కోరాడు.


,

A post shared by Abijit Ganguly (@abijitganguly)

మరిన్ని వార్తలు