ఉమేశ్‌ యాదవ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. షాక్‌ తిన్న రహానే

13 Apr, 2021 17:03 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌ వెబ్‌సైట్‌

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కేపై ఘన విజయం సాధించి మంచి జోష్‌లో కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌లోనూ మెరుపులు మెరిపిస్తుంది. ఇటీవలే దగ్గు, గొంతునొప్పితో ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన ఉమేశ్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి వచ్చినా తుది జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఉమేశ్‌ యాదవ్‌ క్వారంటైన్‌ పూర్తి చేసుకొని ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. ఈ నేపథ్యంలో ఉమేశ్‌ ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదరగొట్టడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రాక్టీస్‌లో భాగంగా ఉమేశ్‌ వేసిన బంతిని రహానే ఆఫ్‌సైడ్‌ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రహానే బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి ఉమేశ్‌ వైపు దూసుకొచ్చింది. అయితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉమేశ్‌ యాదవ్‌ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌ చేస్తున్న రహానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీనిని ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఉమేశ్‌ ఆన్‌ ఫైర్‌.. స్టన్నింగ్‌ క్యాచ్‌ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. అంతకముందు ఆసీస్‌ టూర్‌కు దూరమైన తర్వాత తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉమేశ్‌ యాదవ్‌ తీవ్ర కసరత్తులు చేశాడు. కొన్ని రోజుల క్రితం తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో చెప్పడానికి ఒక వీడియోనూ రిలీజ్‌ చేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉమేశ్‌ యాదవ్‌ను కనీస ధరకు( రూ. కోటి) దక్కించుకున్న సంగతి తెలిసిందే. సీఎస్‌కేపై విజయంతో జోష్‌లో ఉన్న ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 15న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: శ్రేయస్‌ అ‍య్యర్‌కు పాంటింగ్‌ ఆహ్వానం..!

ఆఫ్‌ స్పిన్‌ టెస్టుల్లో మాత్రమే వేస్తావా.. టీ20ల్లో వేయవా!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు