కోహ్లి, డివిలియర్స్‌.. మీరెప్పుడు నా వెనకే

8 Apr, 2021 10:39 IST|Sakshi

చెన్నై: ఉసేన్‌ బోల్ట్‌.. ఈ పేరు తెలియని వారుండరు. స్ర్పింట్‌ విభాగంలో తన పేరిట ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన బోల్ట్‌ రన్నింగ్‌ రారాజుగా అభివర్ణిస్తారు. అయితే కోహ్లి, డివిలియర్స్‌లనుద్దేశించి బోల్ట్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు విషయంలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం పూమా క్రికెట్‌ ప్రమోషన్‌లో భాగంగా కోహ్లి, డివిలియర్స్‌లు ప్రాక్టీస్‌ సందర్భంగా రన్నింగ్‌ రేస్‌ పెట్టుకున్నారు. ఆ రేస్‌లో విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌ ను దాటి దేవదత్‌ పడిక్కల్‌ ముందుకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్‌ అయింది. తాజాగా ఈ వీడియోపై ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ మధ్య ట్విటర్‌లో చర్చ నడిచింది. మరోసారి కోహ్లి, డివిలియర్స్‌ మధ్య రన్నింగ్‌ రేస్‌ పెట్టాలని.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే అతని ఫిట్‌నెస్‌ అంత మెరుగ్గా ఉన్నట్లని తెలిపారు.

అయితే వీరి సంభాషణ మధ్యలో అనూహ్యంగా ఆర్‌సీబీ జెర్సీ వేసుకొని వచ్చిన బోల్ట్‌.. కోహ్లి, డివిలియర్స్‌ మధ్య రేస్‌ పెట్టినా.. ఎప్పుడు నా వెనకే ఉంటారు.. అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు. ' ఆర్‌సీబీ చాలెంజర్స్‌.. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తేవాడిని నేనే అనుకుంటా.. కోహ్లి, డివిలియర్స్‌ ఎప్పుడు నా వెనకే అంటూ కామెంట్‌ చేశాడు. కాగా ఆర్‌సీబీ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 9న ముంబై వేదికగా డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. 

చదవండి: కోహ్లి, డివిలియర్స్‌ రన్నింగ్‌‌... ఆఖర్లో ఊహించని ట్విస్ట్‌‌‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు