IPL 2021: ఇంటికి చేరుకున్న వరుణ్‌, సందీప్‌

11 May, 2021 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ సమయంలో కరోనా బారిన పడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్రికెటర్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్స్‌ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. పది రోజుల క్వారంటైన్‌ ముగియడంతో వరుణ్‌ బెంగళూరుకు, సందీప్‌ త్రిచూర్‌కు వెళ్లిపోయారు. వారు మళ్లీ కోవిడ్‌–19 పరీక్షకు హాజరవుతారు. మరో వైపు పాజిటివ్‌గా తేలిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు టిమ్‌ సీఫెర్ట్‌ ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. వరుణ్, సందీప్‌ కేసులు బయటపడిన అనంతరమే 2021 ఐపీఎల్‌ వాయిదా వరకు వెళ్లింది.

కాగా బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కోవిడ్‌ బారిన పడుతుండటంతో ఈ సీజన్‌ను నిరవధింకగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా స్థానికంగా టోర్నీ నిర్వహించే అవకాశం లేదని, యూఏఈ లేదా ఇంగ్లండ్‌లోనే మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. ఇక ఐపీఎల్‌-2021లో ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు జరుగగా, ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 విజయాలు నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

చదవండి: కోవిడ్‌పై పోరు: సన్‌రైజర్స్‌ భారీ విరాళం
IPL 2021: నీ వల్లే ఐపీఎల్‌ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్‌!

మరిన్ని వార్తలు