సిక్స్‌ ఇలా కొట్టాలి.. రిషభ్‌తో కోహ్లి ముచ్చట

28 Apr, 2021 10:50 IST|Sakshi
Photo Courtesy: Twitter

ఆర్సీబీ విజయం తర్వాత పంత్‌-కోహ్లిల చిట్‌చాట్‌

అహ్మదాబాద్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పరుగు తేడాతో విజయం సాధించింది. ఆసక్తిరేపిన మ్యాచ్‌లో కోహ్లి సేననే విజయం వరించింది. సిరాజ్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి బంతికి ఢిల్లీ సిక్స్‌ కొడితే విజయం సాధిస్తుంది. కానీ ఆ బంతిని పంత్‌ ఫోర్‌ మాత్రమే కొట్టడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.సిరాజ్‌ ఆఫ్‌సైడ్‌ యార్కర్‌ వేసిన ఆ బంతిని పంత్‌ సిక్స్‌ కొట్టాలని యత్నించినా బౌండరీ మాత్రమే లభించింది. దాంతో ఆర్సీబీ నిర్దేశించిన 172 పరుగులు టార్గెట్‌లో ఢిల్లీ 170 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. 

కాగా, ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత అవార్డుల కార్యక్రమానికి ముందు పంత్‌తో కోహ్లి ముచ్చటించాడు. ఆ ఇద్దరూ కలిసిన ఆ మూమెంట్‌ను కెమెరాలు బంధించడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అందులో పంత్‌కు కోహ్లి సిక్స్‌ గురించే బోధ చేసినట్లు కనబడింది. కాస్త పైనుంచి హిట్‌ చేసి ఉంటే అది సిక్స్‌ వచ్చేదని కోహ్లి సైగలను బట్టి అర్థమవుతోంది. దీనికి పంత్‌ సమాధానమిస్తూ.. అది ఆఫ్‌ స్టంప్‌కు పడిందని కోహ్లికి వివరణ ఇస్తున్నట్లు ఆ వీడియో క్లిప్‌ ద్వారా తెలుస్తోంది. ఆ క్రమంలోనే వారి మధ్య నవ్వులు పూయగా,ఆపై వారితో సిరాజ్‌ కూడా వచ్చి చేరాడు.

ఇక్కడ చదవండి: ఏబీ.. నీకు హ్యాట్సాఫ్‌: కోహ్లి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు