IPL 2021: కోహ్లి ఎట్టకేలకు సాధించాడు..

18 Apr, 2021 16:47 IST|Sakshi
Courtey: IPL Twitter

చెన్నై: ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌పై  పైచేయి సాధించాడు. అదేంటి మోర్గాన్‌పై ఏ విషయంలో కోహ్లి పైచేయి సాధించాడనే అనుమానం వస్తుంది కదూ. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌, ఆర్‌సీబీ మధ్య చెపాక్‌ మధ్య నేడు జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి టాస్‌ గెలిచాడు. అయితే ఇప్పటివరకు ఇద్దరి మధ్య 8 టాస్‌లు వేయగా.. మోర్గాన్‌ 7 సార్లు గెలవగా.. కోహ్లి అన్నిసార్లు ఓడిపోయాడు. అయితే ఈ టాస్‌లు ఓడిపోయింది ఐపీఎల్‌లో అనుకుంటే పొరపాటు. వాస్తవానికి ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ భారత్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ ఎనిమిదింటిలో మొదటి వన్డే మినహా అన్నిసార్లు మోర్గాన్‌ టాస్‌ గెలవడం విశేషం.

తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి టాస్‌ గెలవడం ద్వారా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. ''ఎట్టకేలకు టాస్‌ విషయంలో మోర్గాన్‌పై విజయం సాధించాను. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిపోయిన నేను ఈరోజు మోర్గాన్‌పై పైచేయి సాధించి 7-1 కి తగ్గించాను. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగాం. డేనియల్‌ క్రిస్టియన్‌ స్థానంలో రజత్‌ పాటిధార్‌ తుది జట్టులోకి వచ్చాడు.''అని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ-కేకేఆర్‌లు ఇప్పటివరకూ 27సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో కేకేఆర్‌ 15సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ 12 మ్యాచ్‌లో గెలుపును అందుకుంది. ఇక ఇరుజట్లు తలపడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీదే పైచేయిగా ఉంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీనే విజయం సాధించింది. 
చదవండి: ఆ రికార్డుపై వార్నర్‌ కన్నేస్తే.. రోహిత్‌ అతనిపై కన్నేశాడు
చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్‌ మాత్రం

మరిన్ని వార్తలు