ఆ రికార్డుపై వార్నర్‌ కన్నేస్తే.. రోహిత్‌ అతనిపై కన్నేశాడు

17 Apr, 2021 18:05 IST|Sakshi
Courtesy: IPL Twitter

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో  ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముంగిట అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. ఐపీఎల్‌లో 50 అర్థసెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించేందుకు వార్నర్‌ అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు వార్నర్‌ 144 మ్యాచ్‌లాడి 49 అర్థసెంచరీలు సాధించాడు. ఆ తర్వాత శిఖర్‌ ధావన్‌(42, 178 మ్యాచ్‌లు), విరాట్‌ కోహ్లి(39, 194 మ్యాచ్‌లు), సురేశ్‌ రైనా(39, 195 మ్యాచ్‌లు), ఏబీ డివిలియర్స్‌( 38, 171 మ్యాచ్‌లు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. కాగా వార్నర్‌ ఈ సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన రెండో మ్యాచ్‌లో అర్థసెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఇదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కూడా ఒక రికార్డు ఊరిస్తుంది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రోహిత్‌ డేవిడ్‌ వార్నర్‌ను అధిగమించే అవకాశం వచ్చింది.వార్నర్‌ 144 మ్యాచ్‌ల్లో 5311 పరుగులు చేయగా.. రోహిత్‌ 202 మ్యాచ్‌ల్లో 5292 పరుగులు చేశాడు. వార్నర్‌, రోహిత్‌ల మధ్య 9 పరుగుల తేడా మాత్రమే ఉంది. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 194 మ్యాచ్‌ల్లో 5944 పరుగులతో విరాట్‌ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. 
చదవండి: వైరల్‌: వికెట్‌ తీసిన ఆనందం.. విండీస్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌‌
'ఆ చిన్న లోపాలు సరిచేసుకో.. మిగతాదంతా సూపర్'‌

>
మరిన్ని వార్తలు