నా డార్లింగ్‌తో చివరి పెగ్‌: వార్నర్‌

1 Apr, 2021 19:35 IST|Sakshi

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఓ ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోలో వార్నర్‌.. తన భార్య క్యాండిస్‌తో కలిసి వైన్‌ తాగుతూ కనిపిస్తాడు. భారత్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది, అదృష్టవశాత్తు కొన్ని నెలలు కుటుంబంతో గడిపే సమయం దొరికింది, నా డార్లింగ్‌(క్యాండిస్‌‌)తో ఇదే చివరి పెగ్‌, లవ్‌ యూ.. మిస్‌ యూ అంటూ క్యాప్షన్‌ జోడించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, వార్నర్‌ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌ కోసం భారత్‌కు బయలుదేరుతున్నాని, తన కూతుళ్లతో లాస్ట్‌ డిన్నర్‌ చేశానని ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్‌ చేశాడు. దీంతో సన్‌రైజర్స్‌ అభిమానులు అతను భారత్‌కు బయలుదేరాడని తెగ సంబర పడిపోయారు. 

A post shared by David Warner (@davidwarner31)

అయితే తాజా పోస్ట్‌ను బట్టి చూస్తే వార్నర్‌ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా, ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్‌.. ఇటీవలే దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చి, సత్తా చాటాడు. దీంతో సన్‌రైజర్స్‌ అభిమానులు అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా, ఏప్రిల్‌ 9న ప్రారంభంకానున్న సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. సన్‌రైజర్స్‌ తన మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొంటుంది. ఏప్రిల్‌ 11న జరిగే ఈ మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది.
చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడికి కరోనా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు