రసెల్‌ ఔట్‌ ప్లాన్‌లో భాగమా?.. ధోని రిప్లై అదిరింది

22 Apr, 2021 16:44 IST|Sakshi

ముంబై:  సీఎస్‌కేతో మ్యాచ్‌.. కేకేఆర్‌కు 221 పరుగుల టార్గెట్‌.  31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన మోర్గాన్‌ సేన. 100 పరుగులోపే ఆలౌట్‌ అవుతుందని విశ్లేషకుల అంచనా. కానీ అది జరగలేదు. దినేశ్‌ కార్తీక్‌-ఆండ్రీ రసెల్‌ దెబ్బకు  మొత్తం పరిస్థితి మారిపోయింది.  ఇద్దరూ కలిసి కేకేఆర్‌ ఇన్నింగ్స్‌  హెరెత్తించారు. కాగా, ఈ జోడి 83 పరుగులు జత చేసిన తర్వాత రసెల్‌ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. రసెల్‌ను ఔట్‌ చేయకపోతే మ్యాచ్‌ చేజారిపోయే స్థితిలో అతను బౌల్ట్‌ అయ్యాడు. సామ్‌ కరాన్‌ వేసిన 12 ఓవర్‌ రెండో బంతి రసెల్‌ లెగ్‌ స్టంప్‌ను పట్టుకుపోవడంతో ఒక్కసారిగా కేకేఆర్‌ శిబిరంలో నిరుత్సాహం.. సీఎస్‌కే శిబిరంలో ఫుల్‌ జోష్‌. 

కాగా, రసెల్‌ ఔట్‌ అనేది ప్లాన్‌ ప్రకారం జరిగిందా అనేది సగటు క్రికెట్‌ అభిమాని మదిలో మెదిలిన అనుమానం. బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌కు తగ్గట్టు వ్యూహాల్ని సిద్ధహస్తుడైన ధోనినే రసెల్‌ను ఔట్‌ చేయడానికి లెగ్‌ స్టంప్‌ ప్యాడ్స్‌లోకి బంతిని సంధించమన్నాడా.. కరాన్‌కు ఇలా చేయమని సలహా ఇచ్చాడా? ఇవే  సందేహాలు. కానీ పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో ధోని సమాధానమిచ్చాడు. ధోనికి ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా రసెల్‌ ఔట్‌పై వివరణ ఇచ్చాడు.

‘ రసెల్‌ ఔట్‌  ప్లాన్‌ ప్రకారమే జరిగిందని సులువుగా చెప్పేయవచ్చు. కానీ అలా జరగలేదు. నేను సామ్‌ కరాన్‌కు రసెల్‌ ఔట్‌పై ఎటువంటి సూచన చేయలేదు. లెగ్‌స్టంప్‌పై మేము చాలా బంతుల్నే వేశాం. అదొక అద్భుతమైన బంతి. అది అతని చేతి నుంచి సాధారణంగా వచ్చేంది తప్పా ఇక్కడ ప్లానింగ్‌ లేదు’ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 19.1 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటై ఓటమి చెందింది.

ఇక్కడ చదవండి: వైరల్‌: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే
రసెల్‌.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!

>
మరిన్ని వార్తలు