భారీ హిట్టర్లు ఉంటే ఇలానే ఉంటుంది: ధోని

2 May, 2021 07:24 IST|Sakshi
Photo Courtesy: IPL

కొన్ని తప్పిదాలతోనే మూల్యం చెల్లించుకున్నాం

ఢిల్లీ: తాము చేసిన కొన్ని తప్పిదాల కారణంగానే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయామని సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్‌ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ స్కోరు చేసినా ఒత్తిడిని అధిగమించలేని కారణంగా మ్యాచ్‌ చేజారిపోయిందన్నాడు. మ్యాచ్‌ తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘ ఇది ఒక మంచి వికెట్‌. ఈ తరహా బ్యాటింగ్‌ వికెట్‌ కచ్చితంగా బౌలర్లకు సవాలే. కీలక సమయంలో క్యాచ్‌లు జారవిడిచాం. మా బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్‌ చేశారు. కానీ ఈ మ్యాచ్‌ ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి.

ఈ వికెట్‌ హిట్‌ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లను దగ్గరగా వచ్చి ఓడిపోయాం. అలాగే కొన్ని క్లోజ్‌ గేమ్స్‌లో గెలిచాం. పాయింట్ల టేబుల్‌లో ఎక్కడ ఉన్నామనే విషయంతో సంబంధం లేకుండా ఆ టైమ్‌లో గేమ్‌పైనే దృష్టి పెట్టాలి.  అప్పుడే పాయింట్ల టేబుల్‌లో నీ స్థానం మెరుగ్గా ఉంటుంది. భారీ హిట్టర్లు ఉన్నప్పుడు తప్పిదాలు చేస్తే ఇలానే ఉంటుంది. పెద్ద టార్గెట్‌లు కూడా చిన్నవిగానే ఉంటాయి. ఆ సమయంలోనే ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయాలి.  20 ఓవర్‌లో కనీసం ఒక సిక్స్‌ కూడా రాకపోయినట్లయితే మ్యాచ్‌ను గెలిచేశాళ్లం. ఇది బాధిస్తోంది.. కానీ గేమ్‌ స్పిరిట్‌తో ముందుకు వెళ్లాలి’ అని పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు