‘ఫామ్‌లోకి రావాలంటే ముందు బ్రేక్‌ తీసుకో’

18 Apr, 2021 16:49 IST|Sakshi
Photo Courtesy:Twitter

న్యూఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పెట్టుకున్న నమ్మకాన్ని అందుకోలేకపోయిన మనీష్‌ పాండే తాత్కాలికంగా బ్రేక్‌ తీసుకుంటేనే మంచిదని టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అభిప్రాయపడ్డాడు. గడిచిన మూడు మ్యాచ్‌లను చూస్తే ఒక్క సొగసైన ఇన్నింగ్స్‌(మ్యాచ్‌ను గెలిపించే) కూడా అతని బ్యాట్‌ నుంచి రాలేదని, దాంతో కాస్త విరామం తీసుకుంటే గాడిలో పడతాడన్నాడు. మనీష్‌ బ్రేక్‌ తీసుకుంటే అది అతనికి ఉపయోగపడుతుందని తెలిపాడు.

స్పోర్ట్స్‌ టుడేతో ఓజా మాట్లాడుతూ.. ‘ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మనీష్‌కు అతని స్థాయిలో రాణించాలంటే కాస్త విశ్రాంతి అవసరం. వార్నర్‌, బెయిర్‌ స్టోలు ఆరంభం విఫలం కాకుండా మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఫేవర్‌గా ఉండాలంటే కేదార్‌ జాదవ్‌ లాంటి ఆటగాళ్లని మిడిల్‌ ఆర్డర్‌ పరీక్షించండి. కేవలం వార్నర్‌-బెయిర్‌ స్టోలే మ్యాచ్‌లను గెలిపించలేరు. మనీష్‌కు కొన్ని మ్యాచ్‌లు రెస్ట్‌ ఇవ్వండి. అది అతనికే మంచిదే అవ్వడమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుంది’ అని ఓజా స్పష్టం చేశాడు. 

ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ ఇంకా ఖాతా తెరవలేదు. మూడు మ్యాచ్‌లు ఆడి మూడింట పరాజయం చెందింది. మిడిల్‌ ఆర్డర్‌లో మనీష్‌ పాండే పూర్తిస్థాయిలో ఆకట్టులేకవడం ఆ జట్టును నిరాశపరుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీష్‌ 44 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక​ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 7 బంతులాడి 2 పరుగులతో నిరాశపరిచాడు. 

ఇక్కడ చదవండి: 
గాయాల బారిన ‘సన్‌రైజర్స్‌’

అందుకోసమే బంతి విసిరాను..రనౌట్‌ ఊహించలేదు

రోహిత్‌ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. 

మరిన్ని వార్తలు