‘అందుకే విలియమ్సన్‌‌ని‌ జట్టులోకి తీసుకోలేదు’

12 Apr, 2021 13:07 IST|Sakshi

విలియమ్సన్‌కు ఫిట్‌నెస్‌ పరంగా కొంత సమయం ఇవ్వాలనుకున్నాం : సన్‌రైజర్స్‌ కోచ్‌ 

చెన్నై: గత ఐదు సీజన్‌లలో నిలకడగా ఆడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఈసారి శుభారంభం లభించలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ బృందం చివరి వరకు పోరాడి 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో ఓడింది. అయితే కేన్ విలియమ్సన్‌ను జట్టులోకి తీసుకోకపోవడం హైదరాబాద్‌ ఓటమిపై ప్రభావం చూపించింది. ఒకవేళ విలియమ్సన్‌‌ గనుక నిన్నటి మ్యాచ్‌లో ఉండుంటే‌ ఫలితం మరోలా ఉండేదని మాటలు వినపడుతున్నాయి. మ్యాచ్ అనంతరం జరిగిన వర్చువల్‌ సమావేశంలో సన్‌రైజర్స్‌ జట్టు కోచ్‌ ట్రెవర్ బేలిస్ ఈ వార్తలపై స్పందించాడు.

“‌‌కేన్‌ విలియమ్సన్‌ జట్టులో అందుబాటులో ఉన్నా అతనికి ఫిట్‌నెస్ పరంగా కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. అందుకే గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఓపెనింగ్ గేమ్‌లో ఆడలేదని వివరణ ఇచ్చాడు. కేన్‌ మాకు ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడు, అతని అవసరం జట్టుకు రానున్న మ్యాచ్‌లలో తప్పక ఉంటుంది. కనుక అతనికి నెట్స్‌లో కొంచెం ఎక్కువ సమయం అవసరమని మేము భావించాము. పైగా విలియమ్సన్ ఆడే 4వ స్థానంలో ఇంగ్లాండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అందుబాటులో ఉన్నాడు. జానీ ఇటీవల భారత్‌తో తలపడగా అందులో భారీ స్కోర్లను నమోదు చేయడం మనం చూశాం. 

ఒక దశలో 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా జట్టులో ఉన్న హిట్టర్ అబ్దుల్ సమద్‌ని కాదని విజయ్ శంకర్‌ను బ్యాటింగ్‌కు పంపారు. ఈ విషయం పై అడిగినప్పుడు, బేలిస్ ఇలా అన్నాడు, మా ప్రాక్టీస్ మ్యాచ్‌లలో విజయ్ బాగా ఆడేవాడు. అతను బంతులను సునాయాసంగా బౌండరీలకు తరలించేవాడు , అందులో కొన్న స్టేడియంకు అవతలి వైపు పడ్డ సందర్భాలు ఉన్నాయి, పైగా ఒక మ్యాచ్‌లో ఏకంగా 95 పరుగులు చేశాడు. కనుక అతడు టచ్‌లో ఉన్నాడని మేమే భావించాము. అందుకే ముందు క్రీజ్‌లోకి పంపామని అన్నారు.

"సమద్ గురించి ప్రస్తావిస్తూ.. గత ఐపిఎల్‌లో అతను తక్కువ ఇన్నింగ్స్‌లో ఆడినప్పటికీ తన బ్యాట్‌తో రాణించి జట్టులో గుర్తింపు సంపాదించుకున్నాడు. కనుక ఈ సారి అతను మరిన్ని అవకాశాలు లభించే అవకాశాలున్నాయని తెలిపారు.. 

( చదవండి: 'మా సీక్రెట్‌ అదే.. అందుకే స్థిరంగా ఉన్నాం' )

మరిన్ని వార్తలు