‘మేము ఐపీఎల్‌ ట్రోఫీని గెలవడం కష్టమే కాదు’

24 Apr, 2021 19:33 IST|Sakshi
Photo Courtesy: IPL

చెన్నై: తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి ట్రోఫీని చూడటానికి ఆతృతగా ఉన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన స్మిత్‌.. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ  ఐపీఎల్‌ వేలానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ స్మిత్‌ను వదిలేయడంతో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. కేవలం రూ. 2.2 కోట్ల ధరకే అమ్ముడుపోయాడు స్మిత్‌. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌.. పంజాబ్‌ కింగ్స్‌ 9 పరుగులే చేసి నిరాశపరచగా, ముంబై ఇండియన్స్‌పై 33 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సభ్యులతో ఉన్న అనుభవాల గురించి స్మిత్‌ను అడగ్గా.. ఇక్కడ తనకు చాలా బాగుందన్నాడు. తమ అంతిమ లక్ష్యం ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవడమేనన్నాడు. అంతిమ లక్ష్యాన్ని అధిగమించడమే తమ టార్గెట్‌ అని తెలిపాడు. ‘ మా ఢిల్లీ గ్రూప్‌ బాగుంది. మేము ఐపీఎల్‌ ట్రోఫీని సాధించడం కష్టమే కాదు. చేయగల్గిన ప్రతీదాన్ని చేయడానికి యత్నిస్తాము. మా లక్ష్యం ట్రోఫీని సాధించడమే. 2021 ఐపీఎల్‌ సీజన్‌లో ఆడుతున్న జట్లలో  టైటిల్స్‌ సాధించని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌లు సైతం ఇంకా ఖాతా తెరవలేదు. ఈ మూడు జట్లు ఫైనల్‌ వరకూ వెళ్లినా టైటిల్స్‌ సాధించలేకపోయాయి. 

ఇక్కడ చదవండి: 'ఐపీఎల్‌లో ఆడినా.. జట్టులో రెగ్యులర్‌ సభ్యుడు కాలేడు'
‘బుమ్రా కంటే సిరాజ్‌ గొప్ప బౌలర్‌’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు