నన్ను చంపాలనే ప్రోగ్రామ్‌ పెట్టారా..?: రోహిత్‌

17 Apr, 2021 16:39 IST|Sakshi
Photo Courtesy: Instagram

చెన్నై:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) టైటిల్స్‌ను ఐదుసార్లు సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది ముంబై ఇండియన్స్‌. అయితే ఇన్ని ట్రోఫీలు సాధించడానికి ఆ జట్టు సమష్టి కృషినే కారణం. గత రెండు సీజన్లుగా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్‌ సేన.. ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది.‌ ఆపై కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. ఓటమి అంచుల వరకూ వెళ్లి విజయాన్ని సాధించింది. కాగా,  ఈ విజయం తర్వాత ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ టీమ్‌ బాండింగ్‌ సెషన్‌ నిర్వహించింది. ప్రధానంగా రెండు నిజాలు-రెండు అబద్ధాలు చెప్పాలనే షరతు పెట్టింది. దీనిలో భాగంగా ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇచ్చిన సమాధానాలు అక్కడ నవ్వులు పూయించాయి.

‘ నీ  భార్య  అబద్ధాలు బాగా ఆడుతుందా?’ అని ప్రశ్నించగా,  ‘అవును ఆడుతుంది.  తను అబద్ధం చెప్పాలనుకుంటే అది కచ్చితంగా చెబుతుంది’ అని రోహిత్‌ సమాధానమిచ్చాడు. ‘ఇక నీ భార్య నమ్మదగిన వ్యక్తా.. కదా’ అని అడగ్గా.. దీనికి రోహిత్‌ మాత్రం ఎటువంటి తడబాటు లేకుండా ఆన్సర్‌ చేశాడు.  ‘ నా భార్య చాలా నమ్మదగిన వ్యక్తి’ అని చెబుతూనే ఈ తరహా ప్రశ్నలతో తనను ఏమి చెద్దామని అనుకుంటురన్నాడు. తనను చంపే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా అంటూ ముగించాడు.

ఇక టీమ్‌ బాండింగ్‌ గురించి రోహిత్‌ మాట్లాడుతూ..  ఇది ఒక జట్టుగా ముందుకెళ్లడానికి చాలా ముఖ్యమైన అంశంగా పేర్కొన్నాడు. ఒక గేమ్‌ ఆడటానికి వెళుతున్నప్పుడు ఆటగాళ్లతో సుదీర్ఘమైన చర్చలు జరపడం చాలా అవసరమన్నాడు. ఆటగాళ్లతో ఇంటరాక్షన్‌ అనేది చాలా కీలకమనే విషయాన్ని ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియా టీమ్‌తో చేసిన చాట్‌లో కూడా రోహిత్‌ పేర్కొన్నాడు. ఈ రోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై తలపడనుంది. ఇప్పటివరకూ ముంబై రెండు మ్యాచ్‌లు ఆడి ఒకటి గెలవగా, సన్‌రైజర్స్‌ రెండింటిలోనూ ఓటమి పాలైంది. 

ఇక్కడ చదవండిసాహోరే చహర్‌ బ్రదర్స్‌.. ఇద్దరూ సేమ్‌ టూ సేమ్‌‌‌‌‌
చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్‌ మాత్రం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు