నా ప్లేయర్‌ ద ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు అతనికే: యువీ

18 Apr, 2021 17:39 IST|Sakshi

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శనివారం చెన్నైలోని చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన కీరోన్‌ పొలార్డ్‌(35 నాటౌట్‌; 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు)కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అయితే టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ మాత్రం ఆ మ్యాచ్‌కు సంబంధించిన  మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుకు హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసుకున్నాడు.  ఫీల్డింగ్‌లో మెరిసిన హార్దిక్‌కే తన మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అంటూ ట్వీట్‌ చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ను అద్భుతమైన  త్రో ద్వారా ఔట్‌ చేసిన హార్దికే గేమ్‌ ఛేంజర్‌ అని అన్నాడు.  

దాంతో తన ప్రకారం హార్దికే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అని ట్వీటర్‌లో రాసుకొచ్చాడు.  ఇదొక్కటే ఇక ముంబై ఇండియన్స్‌ ఎందుకు నంబర్‌వన్‌ జట్టు అయ్యిందనే విషయాన్ని తెలియజేస్తుందన్నాడు.  ‘ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌! హార్దిక్‌ పాండ్యా!! ఫీల్డ్‌లో గేమ్‌ ఛేంజర్‌. డెత్‌ బౌలింగ్‌లో ముంబై కింగ్‌ అని మరోసారి నిరూపించుకుంది. బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌లు వారి డెత్‌ బౌలింగ్‌ బలానికి నిదర్శనం. ఒత్తిడిలో ఎలా విజయాలు సాధించాలో ముంబైకి తెలుసు. ఈ కారణాలతోనే ముంబై నంబర్‌వన్‌ జట్టు అయ్యింది’ అని ట్వీట్‌ చేశాడు.  నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 150 పరుగులు  చేస్తే, సన్‌రైజర్స్‌ 137 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన తర్వాత ఈజీగా గెలుస్తుందని భావించినా ముంబై గేమ్‌ ప్లాన్‌ ముందు తలవంచింది. 

ఇక్కడ చదవండి: రోహిత్‌ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. 
గాయాల బారిన ‘సన్‌రైజర్స్‌’

మరిన్ని వార్తలు