చహల్.. ఇమిటేట్‌‌ చేయడంలో నీ తర్వాతే ఎవరైనా‌

9 Apr, 2021 18:15 IST|Sakshi
కర్టసీ: ఆర్‌సీబీ ఇన్‌స్టాగ్రామ్‌

చెన్నై: టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఎంత చలాకీగా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎదుటివారిని ఇమిటేట్‌ చేయడంలో చహల్‌ కాస్త ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో చహల్‌ డబ్య్లూడబ్లూఈ స్టార్‌ రెజ్లర్‌ అండర్‌టేకర్‌ను ఇమిటేట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని ప్రాక్టీస్‌ ఆరంభించిన చహల్‌ ఒక ఫన్నీ వీడియోతో ముందుకొచ్చాడు. ఆ వీడియోలో చహల్‌ అండర్‌టేకర్‌ థీమ్‌ సాంగ్‌కు అతని వాకింగ్‌ స్టైల్‌ను ఇమిటేట్‌ చేస్తూ నడుచుకుంటూ వచ్చాడు. చహల్‌ వెనుకే కైల్‌ జేమిసన్‌ కూడా వెంట వచ్చాడు. అసలే జేమిసన్‌ అండర్‌టేకర్‌లాగే 7 ఫీట్‌ ఉండడం.. అచ్చం అతన్ని అనుకరించడంతో నవ్వులు పూయిస్తుంది.

ఈ సందర్భంగా ఐపీఎల్‌ను వ్రెసల్‌మేనియాతో పోలుస్తూ.. ''చాలెంజర్స్‌ ఆర్‌ రెడీ ఫర్‌ వ్రెసల్‌మేనియా విత్‌ కైల్‌ జేమిసన్‌'' అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ఈ వీడియోనూ ఆర్‌సీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా నేటి మ్యాచ్‌లో డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న ఆర్‌సీబీ ఎలాగైనా విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని భావిస్తుంది. అయితే చహల్‌ ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మూడు వికెట్లు మాత్రమే తీసుకొని ఓవర్‌కు 12పైగా పరుగులు ఇచ్చుకున్న చహల్‌ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. అయితే తన మ్యాజిక్‌ స్పిన్‌తో ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మార్చేయగల సత్తా చహల్‌ సొంతం. ఇక వ్రెస్లింగ్‌లో అండర్‌టేకర్‌ ఎన్నో రికార్డులు సాధించాడు. అత్యధిక వ్రెసల్‌మేనియాలు ఆడిన ఘనత సొంతం చేసుకున్న అండర్‌టేకర్‌.. మొత్తం 28 వ్రెసల్‌మేనియాల్లో పాల్గొని 25 విజయాలు.. రెండు పరాజయాలతో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
చదవండి: 
నా బౌలింగ్‌లో ఒక్క క్యాచ్‌ కూడా పట్టలేవ్‌!

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు