వారెవ్వా చహల్‌.. ముగ్గురిని ఒక్కడే ఆడేసుకున్నాడు

13 Apr, 2021 16:27 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌ వెబ్‌సైట్‌

చెన్నై: ఆర్‌సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తోటి క్రికెటర్లను ఆటపట్టించడంలో ఎప్పుడు ముందుంటాడు. మొన్న కైల్‌ జేమిసన్‌తో కలిసి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ అండర్‌టేకర్‌ను ఇమిటేట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్‌సీబీ సహచరులైన ఏబీ డివిలియర్స్‌, మహ్మద్‌ సిరాజ్‌, సుందర్‌లతో చెస్‌ ఆడిన చహల్‌ ముగ్గురికి ఒకేసారి చెక్‌ చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. దీనికి సంబంధించిన ఫోటోను చహల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. నా కింగ్‌ ఫామ్‌లో ఉన్నాడు.. అందుకు ముగ్గురికి ఒకేసారి చెక్‌ చెప్పా. అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. అంతేగాక చిన్నప్పటి నుంచి చెస్‌ ఆడడం వల్ల ఇప్పుడు మైదానంలో మ్యాచ్‌ ఆడేటప్పుడు ఓపిక ఎంత అవసరమనేది నేర్చుకున్నానంటూ తెలిపాడు. 

అయితే చహల్‌ క్రికెటర్‌ కాకముందు చెస్‌ క్రీడాకారుడిగా ఉన్నాడు. అండర్‌ 12 చెస్‌ విభాగంలో చహల్‌ పలుసార్లు చాంపియన్‌గా కూడా నిలిచాడు. అయితే కెరీర్‌లో ఒక స్టేజ్‌ దాటాకా తనకు ఇష్టమైన చెస్‌ను వదిలేసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అంతకముందు చహల్‌ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ ఆడిన వీడియోనూ ఆర్‌సీబీ ఆటగాడు కెఎస్‌ భరత్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్‌పై విజయంతో ఈ సీజన్‌లో భోణీ కొట్టిన ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 14న చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడనుంది.
చదవండి: నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్‌, జడ్డూలను తీసుకుంటా..

జాన్సన్‌ను ఆడించి ముంబై తప్పు చేసింది: స్టైరిస్‌

A post shared by srikar bharat (@konasbharat)

మరిన్ని వార్తలు