IPL 2021: ఫస్ట్‌ ముంబై.. సెకండ్‌ సీఎస్‌కే

29 Apr, 2021 07:47 IST|Sakshi

ఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఒక జట్టుపై 10, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన జట్ల పరంగా చూస్తే విజయాల శాతంలో సీఎస్‌కే రెండో స్థానాన్ని సాధించింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌తో 15 మ్యాచ్‌లు ఆడిన  సీఎస్‌కే 11 విజయాలు సాధించింది. దాంతో విజయాల శాతంలో 73.33గా ఉంది. ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాల శాతాన్ని నమోదు చేసిన జాబితాలో ముంబై ఇండియన్స్‌  తొలి స్థానంలో ఉంది. కేకేఆర్‌తో ఇప్పటివరకూ 28 ముఖాముఖి పోరుల్లో తలపడిన ముంబై 22 విజయాల్ని సాధించింది. 

ఫలితంగా కేకేఆర్‌పై ముంబై విజయాల శాతం 78.57గా ఉంది. ఆ తర్వాత స్థానాన్ని సీఎస్‌కే ఆక్రమించింది. ఇక మూడో స్థానంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఉంది. పంజాబ్‌ కింగ్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌కు మంచి రికార్డు ఉంది. పంజాబ్‌తో ఇప్పటివరకూ 17 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్‌ ఆర్మీ.. 12 విజయాలు సాధించింది. ఫలితంగా పంజాబ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయాల శాతం 70.59గా ఉంది. ఇక హైదరాబాద్‌‌పై ఇప్పటి వరకూ చెన్నై చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు కాగా.. చెన్నైపై హైదరాబాద్ టీమ్ చేసిన అత్యధిక స్కోరు 192 పరుగులుగా ఉంది. 

>
మరిన్ని వార్తలు