ఆ ఇద్దరికి కోచ్‌ అవసరం లేదు

27 Apr, 2021 15:42 IST|Sakshi
courtesy : IPL/RCB

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఆర్‌సీబీ ఘనంగానే ఆరంభించింది. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలని భావిస్తున్న ఆర్‌సీబీ అంతే కసిగా ఆడుతుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మినహా మిగతా అన్నింటిని గెలిచి  పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న నేపథ్యంలో ఆర్‌సీబీ హెడ్‌కోచ్‌ సైమన్‌ కటిచ్‌ స్పోర్ట్స్‌కీడ్స్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌తో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపించిందని కటిచ్‌ను అడగ్గా.. అతను ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు.

''కోహ్లి, డివిలియర్స్‌లకు కోచ్‌ అవసరం ఉండదు. వారికి సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఇవ్వరు.. ఎందుకంటే ఇప్పటికే గొప్ప క్రికెటర్లలో లిస్టులో స్థానం సంపాధించారు. వారిద్దరు చాలా క్రికెట్‌ ఆడేశారు.వారి అనుభవమే వారికి ఆటను నేర్పుతుంది.. అదే వారికి సలహాలను ఇస్తుంది. ఇక ఆటగాడు బ్యాటింగ్‌ విషయంలో తప్పు చేస్తున్నాడంటే కోచ్‌ ఏదైనా సలహాలు ఇవ్వగలడు. కానీ వారు బ్యాటింగ్‌లో లెజెండ్స్‌.. వారికి నా సలహాలు ఇవ్వలేను.. ఒక్కమాటలో చెప్పాలంటే వారిద్దరికి కోచ్‌ అవసరం లేదు.


Courtesy : IPL Twitter
ఇక ఫిట్‌నెస్‌ విషయంలో కోహ్లికున్న కచ్చితత్వం బహుశా వేరే వాళ్లకు ఉండదేమో. ఏ టైంలో ఏ ఆహారం తీసుకోవాలి.. ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకోవాలంటే ఏం కసరత్తులు చేయాలి.. ఒత్తిడి నుంచి బయటకు వచ్చేందుకు ఏం ఫాలో కావాలి అన్న విషయాల్లో కోహ్లి ది బెస్ట్‌ అని నేను చెబుతా. ముఖ్యంగా కోహ్లిలో ఉన్న నాయకత్వ లక్షణాలు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. గత కొన్నేళ్లుగా అతను ఆర్‌సీబీకీ నాయకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడు టైటిల్‌ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న విఫమవుతూ వస్తుంది. కోహ్లి నాయకత్వంపై నాకు నమ్మకముంది.. ఈసారి మాత్రం ఆర్‌సీబీదే టైటిల్‌.. అంటూ ముగించాడు.  
చదవండి: ఎన్నిరోజులైందో ఇలా కలిసి మాట్లాడుకొని..
IPL 2021: ఆర్సీబీకి భారీ షాక్‌.. వారిద్దరూ ఔట్‌!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు