IPL 2022 Playoffs: మనం కచ్చితంగా ప్లే ఆఫ్స్‌నకు వెళ్తాం... కోల్‌కతాలో..

17 May, 2022 17:23 IST|Sakshi
అజింక్య రహానే భావోద్వేగం(PC: KKR Twitter)

IPL 2022 Playoffs: ‘‘మైదానం లోపల, వెలుపలా.. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. క్రికెటర్‌గా ఎంతో నేర్చుకున్నా. జీవితం గురించి మరింతగా తెలుసుకున్నా. నా సహచర ఆటగాళ్లందరికీ థాంక్స్‌! నాకు మద్దతుగా నిలిచిన సహాయక సిబ్బంది, వెంకీ సర్‌! మేనేజ్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అంటూ టీమిండియా సీనియర్‌ ఆటగాడు, కోల్‌కత్‌ నైట్‌రైడర్స్‌ క్రికెటర్‌ అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు. వచ్చే ఏడాది నూతనోత్సాహంతో తిరిగి వస్తానని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అజింక్య రహానేను కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆడిన 7 మ్యాచ్‌లలో అతడు కేవలం 133 పరుగులు సాధించాడు. అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా అతడు గాయపడిన విషయం తెలిసిందే. కండరాల నొప్పితో ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో సెండాఫ్‌ సమయంలో.. జట్టుతో తనకున్న అనుబంధాన్ని రహానే గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా కేకేఆర్‌ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌నకు చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది మళ్లీ అందరినీ కలుస్తానంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘మన జట్టు తదుపరి మ్యాచ్‌లో తప్పకుండా రాణిస్తుంది. ప్లే ఆఫ్స్‌ కోసం మనం కోల్‌కతా వెళ్తాం’’ అని రహానే వ్యాఖ్యానించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. కాగా ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కోల్‌కతా ఆరింట గెలిచి 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రేయస్‌ బృందం ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందాలి.  

చదవండి👉🏾Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!
చదవండి👉🏾Hardik Pandya: ‘వై దిస్‌ కొలవరి’.. ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తున్న గుజరాత్‌ ఆటగాళ్లు!

మరిన్ని వార్తలు