IPL 2022: ధోని.. బ్యాట్‌ కొరకడం వెనుక అసలు కథ ఇదే!

9 May, 2022 10:29 IST|Sakshi
PC: IPL Twitter

సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫినిషర్‌గా మరోసారి రాణించాడు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని  బంతుల్లో​ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. ధోని ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో సీఎస్‌కే 200 పరుగుల మార్క్‌ను దాటింది. అంతకముందు ఓపెనర్లు డెవన్‌ కాన్వే(49 బంతుల్లో 89), రుతురాజ్‌ గైక్వాడ్‌(33 బంతుల్లో 41) రాణించారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఘోరంగా విఫలమైన ఢిల్లీ 117 పరుగులకే కుప్పకూలింది.

ఈ విషయం పక్కనబెడితే ధోని క్రీజులోకి రావడానికి ముందు తన బ్యాట్‌ను కొరకడం అలవాటు. టీమిండియాకు ఆడిన సమయంలో ధోని చాలా సందర్భాల్లో తన బ్యాట్‌ను కొరికి పరిశీలించేవాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ ధోని బ్యాటింగ్‌ రావడానికి ముందు తన బ్యాట్‌ను కొరుకుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అసలు ధోని ఇలా చేయడం వెనుక కారణాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా ట్విటర్‌లో వెల్లడించాడు.

''ధోని బ్యాట్‌ కొరకడంపై మీకు సందేహాలు ఉన్నాయా.. అయితే వినండి. ధోని తన బ్యాట్‌పై ఏదైనా టేప్‌ ఉండే అవకాశం ఉంటుందని.. దానిని తొలగించడానికే నోటితో కొరుకుతుంటాడు. ప్రతీసారి బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు బ్యాట్‌పై ఎలాంటి టేప్‌ లేదా థ్రెడ్‌ ఉండకూడదని ధోని అనుకుంటాడు. అందుకే మీరెప్పుడైనా ధోని బ్యాట్‌ను గమనించండి.. ఎలాంటి టేప్‌, థ్రెడ్‌ కనిపించవు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచినప్పటికి ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపు లేనట్లే. 11 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక మ్యాచ్‌ ఓటమితో ఢిల్లీకి అవకాశాలు సన్నగిల్లాయి. 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. ఆరు ఓటములతో ఐదో స్థానంలో ఉంది.

చదవండి: MS Dhoni: ధోని అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు

CSK VS DC: కాన్వే హ్యాట్రిక్ హాఫ్ సెంచ‌రీస్‌.. డుప్లెసిస్‌, రుతురాజ్ త‌ర్వాత‌..!

మరిన్ని వార్తలు