IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి!

21 May, 2022 14:02 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరకుండానే వైదొలిగిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది.13 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. 10 ఓటమలుతో ఉన్న ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ముగించాలనుకుంటుంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలిస్తేనే ప్లే ఆఫ్‌ చేరుకుంటుంది.. లేదంటే ఆర్సీబీ వెళుతుంది. దీంతో ఢిల్లీకి ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. ఈ విషయం పక్కనబెడితే.. రెండు సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్‌ జట్టుతో పాటే ఉ‍న్న దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌కు ఇంతవరకు అవకాశం రాలేదు. ఈ సీజన్‌లోనూ అతనికి అదే పరిస్థితి ఎదురైంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌ 13 మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కదాంట్లోనూ అతనికి అవకాశం రాలేదు. 

తాజాగా అర్జున్‌ టెండూల్కర్‌ నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో యార్కర్లతో విరుచుకుపడ్డాడు. ఒక ఓవర్ మొత్తం మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో​ బౌలింగ్‌ వేశాడు. అందులో రెండు బంతులు వికెట్లను తాకుతూ వెళ్లగా.. మరో రెండు బంతులు వికెట్ల పై నుంచి వెళ్లాయి. ఇదంతా గమనించిన టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా..'' అర్జున్‌.. బౌలింగ్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్‌ ఉంది.. కంటిన్యూ చెయ్యు'' అని ఎంకరేజ్‌ చేశాడు.

కాగా అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. గత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విధించిన బారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేవలం మూడు పరుగులతో ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 193 పరుగులు చేయగా.. చేధనకు దిగిన ముంబై 190 పరుగుల వద్ద ఆగిపోయింది. 

చదవండి: Chessable Masters: చెస్‌ వరల్డ్‌ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు

Yuzvendra Chahal: ఐపీఎల్‌ చరిత్రలో చహల్‌ అరుదైన ఫీట్‌

మరిన్ని వార్తలు