IPL 2022: వెస్టిండీస్‌ యువ ఆటగాడికి లక్కీ ఛాన్స్‌.. ఆర్సీబీతో..

12 Apr, 2022 14:30 IST|Sakshi
అష్మీద్‌ నెడ్‌(PC: Twitter)

వెస్టిండీస్‌ యువ ఆటగాడు అష్మీద్‌ నెడ్‌ బంపరాఫర్‌ కొట్టేశాడు. ఐపీఎల్‌-2022 సీజన్‌లో భాగమయ్యే అవకాశం దక్కించుకున్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు అతడు నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అష్మీద్‌కు ఈ ఛాన్స్‌ రావడంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న షెర్ఫానె రూథర్‌ఫర్డ్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

కాగా అండర్‌ 19 ప్రపంచకప్‌-2018 టోర్నీలో వెస్టిండీస్‌ తరఫున బరిలోకి దిగిన నెడ్‌.. ఆ తర్వాత కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) ఆడాడు. ఆ ఈవెంట్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి మూడు వికెట్లు తీశాడు. ఇక గయానాకు చెందిన ఈ 21 ఏళ్ల యువ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 2019లో లిస్ట్‌ ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 12 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. 

ఇక ఇప్పుడు ఐపీఎల్‌లోనూ భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో నెడ్‌ మాట్లాడుతూ.. ఫాఫ్‌ డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వంటి స్టార్లతో మమేకమయ్యే అవకాశం ఉంటుందని హర్షం వ్యక్తం చేశాడు. వారి ఆట తీరును గమనిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరచుకుంటానని పేర్కొన్నాడు. కాగా మంగళవారం(ఏప్రిల్‌ 12) నెడ్‌ ఇండియాకు పయనం కానున్నట్లు సమాచారం. కాగా గతంలో ఐపీఎల్‌కు నెట్‌ బౌలర్‌గా ఎంపికైన ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి యువ కెరటాలు ప్రస్తుతం కీలక ఆటగాళ్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2022: జోరు మీదున్న సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌! కీలక ఆటగాడు దూరం!

మరిన్ని వార్తలు