IPL 2022 Opening Ceremony: అభిమానులకు బీసీసీఐ బ్యాడ్‌న్యూస్‌.. వరుసగా నాలుగో ఏడాది

22 Mar, 2022 17:07 IST|Sakshi

క్యాష్‌రిచ్‌ లీగ్‌గా ముద్రపడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌ 2022 సీజన్‌) మరో నాలుగో రోజుల్లో మొదలుకానుంది. క్రికెట్‌లో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన ఐపీఎల్‌ ఆరంభ వేడుకలను లీగ్‌ ప్రారంభం నుంచి నిర్వహిస్తూ వచ్చింది.  2018 ఐపీఎల్‌ తర్వాత వరుసగా మూడు సీజన్ల పాటు బీసీసీఐ ఆరంభ వేడుకలు నిర్వహించలేదు.  తాజాగా మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌కు సంబంధించిన ఆరంభ వేడుకలను నిర్వహించకూడదని బీసీసీఐ భావిస్తోంది.

కోవిడ్‌-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొనే ఆరంభ వేడుకలను నిర్వహించడం లేదని బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికి.. చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం కోవిడ్‌ మార్గదర్శకాలను మరోసారి విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా నాలుగో ఏడాది ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.  పుల్వామా దాడిలో  మరణించిన అమరవీరులకు గుర్తుగా 2019 ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ వేడుకలను నిర్వహించలేదు. ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఉపయోగించే డబ్బును దాడిలో నేలకొరిగిన అమరవీరుల కుటుంబాలకు విరాళం అందజేశారు. ఆ తర్వాత కోవిడ్‌ కారణంగా 2020,2021 ఐపీఎల్‌ సీజన్లలో ఆరంభ వేడుకలను రద్దు చేశారు.   ఇ‍క మార్చి 26న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌ 15వ సీజన్‌కు తెరలేవనుంది.

చదవండి: IPL 2022 Female Anchors: ఐపీఎల్‌లో అందాల యాంకర్‌ రీ ఎంట్రీ.. టాప్‌-5లో ఉన్నది వీళ్లే!

IPL 2022: మన కెప్టెన్ల సంపాదన ఎంతో తెలుసా? డుప్లెసిస్‌ వంద కోట్లకు పైగానే.. పాపం కేన్‌ మామ మాత్రం

మరిన్ని వార్తలు