IPL 2022- MS Dhoni: ఆ మ్యాచ్‌లు అన్నీ మహారాష్ట్రలోనే... ధోని మాస్టర్‌ ప్లాన్‌.. ముంబైని కొట్టాలిగా మరి!

26 Feb, 2022 11:17 IST|Sakshi
చెన్నై సూపర్‌కింగ్స్‌(PC: IPL)

IPL 2022- CSK- MS Dhoni: టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్‌ ధోనికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ బెస్ట్‌ రికార్డు ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిపిన ఘనత అతడిది. డాడీస్‌ గ్యాంగ్‌ యువకులతో పోటీ పడగలదా అంటూ హేళన చేసిన వాళ్లకు విజయాలతోనే సమాధానమిచ్చాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.

వేలం మొదలు, ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు.. ఇలా ప్రతి అంశంలోనూ కీలకంగా వ్యవహరించే ధోని తన మాస్టర్‌ మైండ్‌తో చెన్నైని మేటి జట్టుగా నిలిపాడు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలోనూ ధోని తన మార్కు చూపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ ఆరంభం కానున్న వేళ బీసీసీఐ వేదికలను ఖరారు చేసింది.

మహారాష్ట్రలోనే ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక టైటిల్స్‌ పరంగా చెన్నై కంటే ఒక అడుగు ముందున్న ముంబై ఇండియన్స్‌ జట్టుకు అన్ని మ్యాచ్‌లు ‘సొంత రాష్ట్రం’లోనే ఆడటం కలిసి వస్తుందనే భావన ఉంది. 

ఈ నేపథ్యంలో ధోని వ్యూహాత్మకంగా పావులు కదిపిన తీరు విశ్లేషకులను, అభిమానులను ఆకట్టుకుంటోంది. సీజన్‌ ఆరంభానికి ముందు చెన్నై జట్టు 20 రోజుల పాటు ట్రెయినింగ్‌ నిమిత్తం క్యాంపునకు వెళ్లనుంది. సాధారణంగా చెన్నైలోని ఈ శిక్షణ ఉండాల్సింది. అయితే, మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో జరుగనున్న వేళ్ల శిబిరాన్ని సూరత్‌కు తరలించిందట చెన్నై ఫ్రాంఛైజీ. ధోని సలహాతో జట్టు మొత్తం గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకోనున్నారట. 

సూరత్‌కే ఎందుకు?
సూరత్‌లోని లాల్‌భాయి కాంట్రాక్టర్‌ స్టేడియంను ఇటీవలే నిర్మించారు. ఇక్కడి పిచ్‌ల ముంబై మాదిరి పిచ్‌లనే పోలి ఉంటాయట. ఈ విషయం తెలుసుకున్న ధోని, సీఎస్‌కే వెంటనే తమ క్యాంపును సూరత్‌కు తరలించినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు సూరత్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నైనేశ్‌ దేశాయి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘ఎంఎస్‌ ధోని, డ్వేన్‌బ్రావో, రవీంద్ర జడేజా వంటి జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌ స్టార్లు ప్రాక్టీసు కోసం సూరత్‌కు రానున్నారు. ఇక్కడి మట్టి ముంబై మట్టిని పోలి ఉంటుంది. అందుకే దీనిని వాళ్లు సెలక్ట్‌ చేసుకున్నారు’’ అని తెలిపారు. కాగా మార్చి 2 నుంచి సీఎస్‌కే ప్రాక్టీసు మొదలు కానుంది. గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన ధోని సేన టైటిల్‌ను నిలబెట్టుకునే వ్యూహాలతో ముందుకు సాగుతోంది.

ఐపీఎల్‌-2022- చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు ఇదే!
రవీంద్ర జడేజా :     రూ. 16 కోట్లు 
దీపక్‌ చహర్‌:    రూ. 14 కోట్లు  
ధోని :     రూ. 12 కోట్లు 
మొయిన్‌ అలీ :     రూ. 8 కోట్లు 
అంబటి రాయుడు:    రూ. 6 కోట్ల 75 లక్షలు 
రుతురాజ్‌ గైక్వాడ్‌  :    రూ. 6 కోట్లు 
బ్రేవో:    రూ. 4 కోట్ల 40 లక్షలు 
శివమ్‌ దూబే :   రూ. 4 కోట్లు 
క్రిస్‌ జోర్డాన్‌  :  రూ. 3 కోట్ల 60 లక్షలు 
రాబిన్‌ ఉతప్ప :   రూ. 2 కోట్లు 
ఆడమ్‌ మిల్నే:    రూ. 1 కోటి 90 లక్షలు 
సాన్‌ట్నర్‌  :  రూ. 1 కోటి 90 లక్షలు 
రాజ్‌వర్ధన్‌ హంగార్‌గెకర్‌:    రూ. 1 కోటి 50 లక్షలు 
ప్రశాంత్‌ సోలంకి :   రూ. 1 కోటి 20 లక్షలు 
డెవాన్‌ కాన్వే :   రూ. 1 కోటి 
మహీశ్‌ తీక్షన :   రూ. 70 లక్షలు 
డ్వేన్‌ ప్రిటోరియస్‌ :   రూ. 50 లక్షలు 
భగత్‌ వర్మ :   రూ. 20 లక్షలు 
ఆసిఫ్‌:    రూ. 20 లక్షలు 
తుషార్‌ దేశ్‌పాండే:     రూ. 20 లక్షలు 
జగదీశన్‌   : రూ. 20 లక్షలు 
హరి నిశాంత్‌  :  రూ. 20 లక్షలు 
సుభ్రాన్షు సేనాపతి :   రూ. 20 లక్షలు 
ముఖేశ్‌ చౌదరి:    రూ. 20 లక్షలు 
సిమర్‌జీత్‌ సింగ్‌ :   రూ. 20 లక్షలు 

చదవండి:  బౌలింగ్‌లో దుమ్మురేపాడు.. రాజస్తాన్‌ రాయల్స్‌ పంట పండినట్లే
Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం

మరిన్ని వార్తలు