MS Dhoni IPL Record: ఐపీఎల్‌లో ధోని అరుదైన రికార్డు.. రైనా, డివిల్లియర్స్‌ను వెనక్కి నెట్టి..

22 Apr, 2022 12:48 IST|Sakshi
ఎంఎస్‌ ధోని(PC: IPL/BCCI)

IPL 2022 CSK Vs MI- MS Dhoni Rare Record: ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటర్‌, మిస్టర్‌ ఫినిషర్‌ ఎంఎస్‌ ధోని అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఒక ప్రత్యర్థి బౌలర్‌ బౌలింగ్‌లో అత్యంత వేగంగా వంద పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.

ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్న సురేశ్‌ రైనా, ఏబీ డివిల్లియర్స్‌, కీరన్‌ పొలార్డ్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. గురువారం నాటి మ్యాచ్‌లో ముంబై బౌలర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ బౌలింగ్‌లో వరుస షాట్లు బాది ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో మొత్తంగా ఉనాద్కట్‌ బౌలింగ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న ధోని 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

అంతకుముందు సురేశ్‌ రైనా సందీప్‌ శర్మ బౌలింగ్‌లో 47 బంతుల్లో, ఏబీ డివిల్లియర్స్‌ కూడా సందీప్‌ శర్మ బౌలింగ్‌లోనే 47 బంతుల్లో, కీరన్‌ పొలార్డ్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 47 బంతుల్లో ఈ ఫీట్‌ నమోదు చేశారు. ఇక ముంబైతో మ్యాచ్‌లో మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న ధోని 28 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతికి మిస్టర్‌ కూల్‌ ఫోర్‌ బాదడంతో 3 వికెట్ల తేడాతో జడ్డూ సేనను విజయం వరించింది.

ఐపీఎల్‌లో ఒక ఆటగాడి బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన బ్యాటర్లు:
ఎంఎస్‌ ధోని- 42 బంతుల్లో- జయదేవ్‌ ఉనాద్కట్‌ బౌలింగ్‌లో
సురేశ్‌ రైనా- 47 బంతుల్లో- సందీప్‌ శర్మ బౌలింగ్‌లో
ఏబీ డివిల్లియర్స్‌- 47 బంతుల్లో- సందీప్‌ శర్మ బౌలింగ్‌లో
కీరన్‌ పొలార్డ్‌- 47 బంతుల్లో- రవీంద్ర జడేజా బౌలింగ్‌లో

చదవండి: CSK Vs MI: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్‌ చేరాలంటే!

మరిన్ని వార్తలు