MS Dhoni- Virat Kohli: అరుదైన రికార్డులపై కన్నేసిన ధోని.. కోహ్లి తర్వాత..

4 May, 2022 18:22 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- ఎంఎస్‌ ధోని(PC: IPL/BCCI)

మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన కెప్టెన్సీతో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన తలైవా.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను శిఖరాగ్రాలకు చేర్చాడు. ధోని సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఇక లీగ్‌ ఆరంభం నుంచి చెన్నై కెప్టెన్‌గా ఉన్న ధోని భాయ్‌.. ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో బుధవారం(మే 4) నాటి పోరుతో సీఎస్‌కే తరఫున 200వ మ్యాచ్‌ పూర్తి చేసుకోనున్నాడు.

కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆడిన 199 మ్యాచ్‌లలో ధోని 4312 పరుగులు చేశాడు. సగటు 40.67. ఇక మొత్తంగా టీ20 ఫార్మాట్‌లో మిస్టర్‌ కూల్‌ 5996 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో గనుక మరో ఆరు పరుగులు సాధిస్తే గనుక విరాట్‌ కోహ్లి తర్వాత పొట్టి ఫార్మాట్‌లో 6 వేల పరుగులు సాధించిన రెండో కెప్టెన్‌గా ధోని రికార్డులకెక్కుతాడు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి ఇప్పటి వరకు 190 మ్యాచ్‌ల(185 ఇన్నింగ్స్‌)లో కలిపి ఐదు సెంచరీలు, 48 అర్ధ శతకాల సాయంతో 6451 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత స్థానంలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(4721) పరుగులతో ఉన్నాడు. కాగా ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ ఆరంభంలో సీఎస్‌కే పగ్గాలు చేపట్టిన భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన పదవి నుంచి తప్పుకోవడంతో ధోని మళ్లీ కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. 

ఈ రికార్డులోనూ కోహ్లి వెనుకే ధోనీ..
సీఎస్‌కే తరఫున ధోని ఇప్పటి వరకు 194 సిక్సర్లు కొట్టాడు. మరో ఆరు సిక్స్‌లు గనుక కొడితే ఐపీఎల్‌లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 200 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా తలైవా నిలుస్తాడు. ధోని కంటే ముందు కోహ్లి ఆర్సీబీ తరఫున ఈ ఘనత సాధించాడు.   

చదవండి👉🏾Wriddhiman Saha: సాహాను బెదిరించిన జర్నలిస్టుకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఇకపై..

Poll
Loading...
మరిన్ని వార్తలు