Ricky Ponting: అంపైర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ వాగ్వాదం

10 Apr, 2022 18:14 IST|Sakshi

క్రికెట్‌లో ఎమోషన్స్‌కు కొదువ ఉండదు. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అంపైర్లతో ఆటగాళ్లకు గొడవలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.అందులో ఒక అంపైర్‌ తప్పు చేస్తే.. అవసరంగా మరొక అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ అంపైర్‌తో వాగ్వావాదానికి దిగడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేశాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని ఉమేశ్‌ ఫుల్‌టాస్‌ యార్కర్‌ వేశాడె. బంతి వైడ్‌ లైన్‌ అవతల పడినప్పటికి అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదు. అయితే శార్దూల్‌ అది వైడ్‌ కదా అని అంపైర్‌ను చూసినప్పటికి అతని వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. దీంతో ఇదేం నిర్ణయమో అంటూ తర్వాతి బంతికి సిద్ధమయ్యాడు.

ఇదే సమయంలో డగౌట్‌లో ఉన్న పాంటింగ్‌.. ''అదేంటి అంత క్లియర్‌గా వైడ్‌ అని తెలుస్తుంటే అంపైర్‌ ఇవ్వకపోవడమేంటి'' అని అరిచాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో అంపైర్‌తో వైడ్‌ ఇవ్వకపోవడమేంటని వాగ్వాదానికి దిగాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. 

చదవండి: IPL 2022: చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు

మరిన్ని వార్తలు