Dinesh Karthik-Code Of Conduct: దినేశ్‌ కార్తిక్‌ ఏంటిది? డీకేకు మందలింపు! కీలక మ్యాచ్‌కు ముందు షాక్‌!

27 May, 2022 16:15 IST|Sakshi
ఆర్సీబీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌(PC: IPL)

IPL 2022 LSG Vs RCB: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌కు భారీ షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు అతడిని మందలించారు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

‘‘మే 25న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో లక్నో సూపర్‌ జెయింఠ్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు చెందిన దినేశ్‌ కార్తిక్‌ను మందలించడం జరిగింది. మిస్టర్‌ కార్తిక్‌ ఐపీఎల్‌ ప్రవర్తనా నియావళిలోని ఆర్టికల్‌​ 2.3ని (లెవల్‌-1)ఉల్లంఘించాడు. ఈ విషయంలో మ్యాచ్‌ రిఫరీదే తుది నిర్ణయం’’ అని పేర్కొంది.

అయితే, అతడు ఏ తప్పు చేశాడో మాత్రం వెల్లడించలేదు. అలాగే లెవల్‌ నిబంధన 1 ఉల్లంఘించినందున వార్నింగ్‌తో సరిపెట్టింది. కాగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న డీకే.. 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆర్సీబీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ ఐదో బంతిని తప్పుగా అంచనా వేసిన డీకే కేవలం ఒక పరుగు మాత్రమే తీయగలిగాడు. దీంతో కోపంతో అతడు గట్టిగా అరిచినట్లు కనిపించింది.

ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు అతడిని మందలించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి గెలిచిన ఆర్సీబీ క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో శుక్రవారం(మే 27) పోటీకి సిద్ధమైంది. తుది పోరుకు అర్హత సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది.

డీకే అదుర్స్‌
కాగా ఈ సీజన్‌లో ఆడిన 15 మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి ఫినిషర్‌గా డీకే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 324 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 66 నాటౌట్‌. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాడు.

చదవండి 👇
IPL 2022 Title Winner Prediction: క్వాలిఫైయర్‌-2లో గెలుపు వారిదే.. టైటిల్‌ కొట్టేదీ వాళ్లే: హర్భజన్‌ సింగ్‌
Qualifier 2 RR Vs RCB: సమఉజ్జీలు.. పంతం నీదా- నాదా సై.. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిస్తే!

మరిన్ని వార్తలు