IPL 2022 Final: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫైనల్‌ మ్యాచ్‌ వేళలో మార్పు! కారణం ఇదే!

19 May, 2022 16:08 IST|Sakshi
ఐపీఎల్‌ ఫైనల్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం(PC: IPL/BCCI)

IPL 2022- Final Match: ఐపీఎల్‌-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టైమింగ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్‌ను 8 గంటలకు ఆరంభించనున్నట్లు సమాచారం.

తాజా ఎడిషన్‌ ముగింపు వేడుకలను నిర్వహించే క్రమంలో మ్యాచ్‌ వేళలో ఈ మార్పు చేసినట్లు క్రిక్‌బజ్‌ కథనం వెల్లడించింది. ఇందులోని వివరాల ప్రకారం.. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు బాలీవుడ్‌ తారలతో కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. 

ఈ క్రమంలో ఏడున్నరకు టాస్‌ వేస్తే.. ఎనిమిదింటి నుంచి మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఇక మే 24 నుంచి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. కోల్‌కతాలో ఫస్ట్‌ క్వాలిఫైయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌ జరుగనుంది. ఇప్పటికే కొత్త ఫ్రాంఛైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.

చదవండి: IPL 2022 RCB Vs GT Prediction: నిలవాలంటే గెలవాలి.. అదీ భారీ తేడాతో

మరిన్ని వార్తలు