IPL 2022 Prize Money: ఐపీఎల్‌ విజేత, ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!

29 May, 2022 08:11 IST|Sakshi
రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌, గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

IPL 2022 Winner Prize Money: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-2022 తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌.. మెగా టోర్నీ మొదటి ఎడిషన్‌ విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ట్రోఫీ కోసం మ్యాచ్‌ జరుగనుంది.

హార్దిక్‌ పాండ్యా బృందం.. సంజూ శాంసన్‌ సేన.. టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదికైంది. మరి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టు, ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌, పర్పుల్‌ ​క్యాప్‌ హోల్డర్‌లకు ఎంత మొత్తం ప్రైజ్‌మనీ లభిస్తుందో తెలుసా?

ఐపీఎల్‌ విజేతకు రూ. 20 కోట్లు ప్రైజ్‌మనీగా లభిస్తాయి.
ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 13 కోట్లు దక్కుతాయి.
ఇక టోర్నీ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు అందించే ‘ఆరెంజ్‌ క్యాప్‌’ అవార్డు రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ బట్లర్‌కు ఖాయమైంది. బట్లర్‌ 16 మ్యాచ్‌లు ఆడి మొత్తం 824 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. బట్లర్‌కు రూ. 15 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తాయి.
టోర్నీ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ప్రదానం చేసే ‘పర్పుల్‌ క్యాప్‌’ అవార్డు రేసులో హసరంగ (బెంగళూరు), చహల్‌ (రాజస్తాన్‌) ఉన్నారు. వీరిద్దరు 26 వికెట్ల చొప్పున తీశారు. ఫైనల్లో చహల్‌ ఒక వికెట్‌ తీస్తే అతనికి ‘పర్పుల్‌ క్యాప్‌’ అవార్డుతోపాటు రూ. 15 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తాయి.

చదవండి 👇
RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్‌.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్‌! హృదయాలు గెలిచారు!

Poll
Loading...
మరిన్ని వార్తలు