IPL 2022 Winner: అప్పుడు రాజస్తాన్‌.. ఇప్పుడు గుజరాత్‌.. మధ్యలో ముంబై

30 May, 2022 12:46 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌ అరుదైన ఘనత(PC: IPL/BCCI)

IPL 2022: ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ తమ తొలి సీజన్‌లో ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోయిన హార్దిక్‌ సేన తొలుత టేబుల్‌ టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో ఏకంగా పది గెలిచి 20 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

ఇక క్వాలిఫైయర్‌-1లో రాజస్తాన్‌ రాయల్స్‌పై విజయం సాధించిన గుజరాత్‌.. ఫైనల్లోనూ ఆ జట్టును ఓడించి టైటిల్‌ గెలిచింది. ఈ విధంగా అప్రహిత విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవడమే గాకుండా కప్‌ గెలిచిన హార్దిక్‌ పాండ్యా బృందం అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో లీగ్‌ దశలో టాపర్‌ కావడంతో పాటు టైటిల్‌ విజేతగా నిలిచిన మూడో జట్టుగా గుర్తింపు దక్కించుకుంది. అంతకు ముందు రాజస్తాన్‌ రాయల్స్‌(2008), ముంబై ఇండియన్స్‌(2017, 2019, 2020) రికార్డు సాధించాయి. ఇక రాజస్తాన్‌ ఐపీఎల్‌ తొలి సీజన్‌ విజేత కాగా.. ముంబై ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2022: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌
►టాస్‌: రాజస్తాన్‌
►రాజస్తాన్‌ స్కోరు: 130/9 (20)
►గుజరాత్‌ స్కోరు: 133/3 (18.1)
►విజేత: ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్‌-2022 చాంపియన్‌గా గుజరాత్‌
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హార్దిక్‌ పాండ్యా(4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, 30 బంతుల్లో 34 పరుగులు)

చదవండి 👇
IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్‌ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే!
Hardik Pandya: సాహో హార్దిక్‌.. గతంలో కెప్టెన్సీ అనుభవం లేదు.. అప్పటికే ఎత్తుపల్లాలు.. అయినా

మరిన్ని వార్తలు