IPL 2022 Final: ఐపీఎల్‌ 2022 చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌

29 May, 2022 23:46 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 15వ సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌
►ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శుబ్‌మన్‌ గిల్‌ 45*, డేవిడ్‌ మిల్లర్‌ 32* గుజరాత్‌ను గెలిపించారు. అంతకముందు హార్దిక్‌ పాండ్యా 34 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో చహల్‌, బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ తలా ఒక వికెట్‌ తీశారు. ఇక అరంగేట్రం సీజన్‌తోనే టైటిల్‌ అందుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది. 2008 తర్వాత మరోసారి కప్‌ గెలవాలన్న రాజస్తాన్‌ రాయల్స్‌ కోరిక నెరవేరలేదు.

హార్దిక్‌ పాండ్యా(34) ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
►131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 34 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యా చహల్‌ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్‌  3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.

టార్గెట్‌ 131.. 9 ఓవర్లలో గుజరాత్‌ 48/2
►131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 9 ఓవర్లు ముగిసేసరికి  రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. గిల్‌ 19, పాండ్యా 9 పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్‌ విజయానికి 66 బంతుల్లో 88 పరుగులు కావాలి.

మాథ్యూ వేడ్‌(8)ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
►మాథ్యూ వేడ్‌(8) రూపంలో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే ప్రయత్నంలో వేడ్‌ రియాన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌ టైటాన్స్‌
►131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రసిధ్‌ కృష్ణ షాక్‌ ఇచ్చాడు. 5 పరుగులు చేసిన సాహాను ప్రసిధ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం రెండో ఓవర్లలో వికెట్‌ నష్టానికి 11 పరుగులు చేసింది.

గుజరాత్‌ టైటాన్స్‌ టార్గెట్‌ 131
►ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఫైనల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగుల స్కోరుకే పరిమితమైంది. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్‌ పరుగులు చేయలేకపోయింది. జాస్‌ బట్లర్‌ 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. జైశ్వాల్‌ 22 పరుగులు చేశాడు. మిగతావారిలో పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 3, సాయి కిషోర్‌ 2, యష్‌ దయాల్, మహ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

18 ఓవర్లలో రాజస్తాన్‌ రాయల్స్ 120/7
►18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ 7, మెకాయ్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

14 ఓవర్లలో రాజస్తాన్‌ 84/4
►ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ నిధానంగా సాగుతుంది. గుజరాత్‌ బౌలర్ల దాటికి రాజస్తాన్‌ పరుగులు చేయలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా వెనుదిరగ్గా.. హెట్‌మైర్‌ 2, అశ్విన్‌ 3 పరుగులతో ఆడుతున్నారు.

డేంజరస్‌ మ్యాన్‌ బట్లర్‌(39) ఔట్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
►ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న జాస్‌ బట్లర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అదరగొట్టలేకపోయాడు. ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడిన బట్లర్‌ 39 పరుగులు చేసి హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 4 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. 

మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌.. పడిక్కల్‌(2) ఔట్‌
►గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో రాజస్తాన్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 2 పరుగులు చేసిన పడిక్కల్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో షమీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. బట్లర్‌ 39 పరుగులతో ఆడుతున్నాడు. కాగా గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ పరుగులు రాబట్టేందుకు చెమటోడుస్తుంది. 

రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ.. శాంసన్‌(14) ఔట్‌
►రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ 14 పరుగులు చేసి హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో సాయి కిషోర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.

8 ఓవర్లలో రాజస్తాన్‌ 59/1
►8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. జాస్‌ బట్లర్ 23, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

యశస్వి జైశ్వాల్‌(22)ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
►గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జైశ్వాల్‌ యష్‌ దయాల్‌ బౌలింగ్‌లో సాయి కిషోర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 31 పరుగులు చేసింది.

2 ఓవర్లలో రాజస్తాన్‌ రాయ్సల్‌ 7/0
►టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించింది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది. బట్లర్‌ (7), జైశ్వాల్(0) క్రీజులో ఉన్నారు.

ఐపీఎల్‌-2022 మెగా ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అరంగేట్రంలోనే అదరగొడుతూ వరుస విజయాలతో ఫైనల్‌ చేరిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఐపీఎల్‌ మొదటి సీజన్‌ విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ అమీతుమీకి సిద్ధమయ్యాయి. తుది పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి.

ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండింటిలోనూ గుజరాత్‌ పైచేయి సాధించింది. లీగ్‌ దశలో నవీ ముంబైలోని డీవై పాటిల్‌ వేదికగా తొలిసారి రాజస్తాన్‌, గుజరాత్‌ తలపడ్డాయి. ఇందులో హార్దిక్‌ పాండ్యా సేన 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక క్వాలిఫైయర్‌-1లో డేవిడ్‌ మిల్లర్‌, హార్దిక్‌ పాండ్యా విజృంభణతో గుజరాత్‌ చిరస్మరణీయ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సగర్వంగా ఫైనల్‌ చేరింది.

తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), శుబ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్,సాయి కిషోర్, లోకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

మరిన్ని వార్తలు