IPL 2022: ఐర్లాండ్‌ యువ పేసర్‌కు బంపరాఫర్‌.. ఏకంగా సీఎస్‌కే తరఫున..

8 Mar, 2022 11:08 IST|Sakshi

ఐర్లాండ్‌ పేసర్‌ జాషువా లిటిల్‌కు బంపరాఫర్‌ దక్కింది. ఐపీఎల్‌లో భాగమయ్యే ఛాన్స్‌ కొట్టేశాడు. క్రికెట్‌ ఐర్లాండ్‌ సమాచారం ప్రకారం.. లిటిల్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లిటిల్‌కు శుభాభినందనలు తెలిపిన క్రికెట్‌ ఐర్లాండ్‌... ‘‘ఐపీఎల్‌ ఆరంభం మ్యాచ్‌లలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో మమేకమయ్యే అవకాశం దక్కించుకున్నందుకు కంగ్రాట్స్‌! సీఎస్‌కే నెట్‌ బౌలర్‌గా ఉండటం అద్భుత అవకాశం’’ అని ట్వీట్‌ చేసింది.

కాగా జాషువా లిటిల్‌  2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. హాంకాంగ్‌తో టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేయగల ఈ 22 ఏళ్ల పేసర్‌.. పొట్టి ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 31 వికెట్లు పడగొట్టాడు. 

వన్డేల్లో 34 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లో ధోని సారథ్యంలో మెళకువలు నేర్చుకునే అవకాశం దక్కించుకున్నాడు. కాగా మార్చి 26 నుంచి ఆరంభం కానున్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సీఎస్‌కే, రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

చదవండి: 'జడేజా ఇన్నింగ్స్‌ అంత గొప్పదేం కాదు.. దమ్ముంటే అక్కడ ఆడి చూపించాలి'
IPL 2022: సింగమ్స్‌ ఇన్‌ సూరత్‌.. అప్పుడే రంగంలోని దిగిన ధోని అండ్‌ కో 

మరిన్ని వార్తలు