Jasprit Bumrah: ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్‌

22 May, 2022 12:15 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 15 వికెట్లు సాధించాడు. కాగా ఐపీఎల్‌లో వరుసగా ఏడు సీజన్ల పాటు 15 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత్‌ బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.  ఈ ఫీట్‌ ఇంకే భారత బౌలర్‌కు సాధ్యపడలేదు.

వాస్తవానికి బుమ్రా సీజన్‌ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో, డెత్‌ ఓవర్లలో తన యార్కర్లతో వికెట్లు తీసే బుమ్రా మనకు కనిపించలేదు. తొలి అంచె పోటీల వరకు ఒక సాధారణ బౌలర్‌గానే ఉన్నాడు. అయితే టి20 ప్రపంచకప్‌ 2022 దృష్టిలో పెట్టుకొని చూస్తే బుమ్రా నుంచి ఇలాంటి బౌలింగ్‌ ఆశించలేము. పూర్తిగా ఫామ్‌ కోల్పోయి బారంగా మారిన సమయంలో రెండో అంచె పోటీల్లో తన పాత బౌలింగ్‌ను వెలికితీశాడు. ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బుమ్రా చివరి రెండు మ్యాచ్‌ళ్లో మూడేసి వికెట్లు తీసి మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి సీజన్‌ను ముగించింది. మరోవైపు ముంబై చేతిలో ఓటమితో ప్లేఆఫ్‌ చాన్స్‌ మిస్‌ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిరాశగా ఇంటికి వెనుదిరిగింది. ఢిల్లీ ఓటమితో అదృష్టం కలిసొచ్చిన ఆర్సీబీ నాలుగో స్థానంలో ప్లేఆఫ్‌కు అడుగుపెట్టింది.

చదవండి: DC Vs MI: ఊహించని ట్విస్ట్‌; మనం ఒకటి తలిస్తే దేవుడు మరోలా..

Poll
Loading...
మరిన్ని వార్తలు