చహల్‌తో కలిసి డ్యాన్స్‌ ఇరగదీసిన ఇంగ్లండ్‌ స్టార్‌.. వీడియో వైరల్‌

6 May, 2022 22:26 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అంచనాలకు మంచి భాగానే రాణిస్తోంది. జోస్ బట్లర్ 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటే.. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ 19 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ ఇద్దరు కలిసి డ్యాన్సింగ్ టు బల్లే ని బల్లే పాటకు ఇరగదీశారు. బట్లర్‌ స్లో మూమెంట్స్‌తో క్యూట్‌గా చేయగా.. చహల్‌ మాత్రం​ మాస్‌ డ్యాన్స్‌ చూపించాడు.

ఇక ఈ పాటకు కొరియోగాఫ్రర్‌ ఎవరో తెలుసా.. చహల్‌ భార్య.. యూట్యూబర్‌ ధనశ్రీ వర్మ. ‘నా మోస్ట్ ఫెవరెట్ రీల్... మై ఫెవరెట్స్... లవ్’ అంటూ ధనశ్రీ కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన 4 మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే... వేరే ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది.

మరిన్ని వార్తలు