Mohammed Shami: షమీ ప్రదర్శనపై శృంగార తార ప్రశంసలు.. వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్న ఆకతాయిలు

31 Mar, 2022 11:00 IST|Sakshi

Kendra Lust Congratulates Mohammed Shami: ఐపీఎల్ 2022లో భాగంగా మార్చి 28న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ రెచ్చిపోయి బౌలింగ్‌ చేయడంతో హార్ధిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షమీ నిప్పులు చెరిగే బంతులు విసిరి లక్నో జెయింట్స్‌ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. తొలి బంతికే కేఎల్ రాహుల్ ను ఔట్ చేసిన షమీ.. డికాక్‌తోపాటు మనీష్ పాండేను పెవిలియన్‌కు పంపి లక్నో భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. 


మహ్మద్‌ షమీ ఈ ప్రదర్శనపై మనసు పారేసుకున్న అమెరికా శృంగార తార కెండ్రా లస్ట్‌, గుజరాత్‌ బౌలర్‌పై ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించింది. అద్భుత ప్రదర్శన చేశావ్ షమీ అంటూ లవ్, క్లాప్ ఎమోజీలను వ్యాఖ్యకు జత చేసి అభినందించింది. కెండ్రా ఈ ట్వీట్ నేపథ్యంలో పలువురు ఆకతాయి నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. శృతిమించిన భాషలో కామెంట్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. కొందరేమో.. షమీ భాయ్ నీ ప్రదర్శనకు అమ్మడు ఫిదా అయినట్లుందని, మరికొందరు కెండ్రా.. షమీతో ప్రేమలో పడిందని, షమీ భాయ్‌ కెండ్రాతో ఎప్పటినుంచి పరిచయం..? బాగా గుర్తుకొస్తున్నట్లున్నావు.. అంటూ అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌తో ద్వారా గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు తమ ఐపీఎల్‌ అరంగేట్రం మ్యాచ్‌లో ఎదురెదురుపడగా.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) లు రాణించారు. ఛేదనలో గుజరాత్.. 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో హార్థిక్ పాండ్యా (33), మాథ్యూ వేడ్ (30), డేవిడ్ మిల్లర్ (30) పర్వాలేదనిపించగా.. ఆఖర్లో రాహుల్ తెవాటియా (40 నాటౌట్)  సంచలన ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను విజయతీరాలను చేర్చాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను షమీకి(3/25)  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 


చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌

>
మరిన్ని వార్తలు