IPL 2022 LSG Vs RCB Live Updates: లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఔట్‌.. క్వాలిఫయర్‌-2కు ఆర్‌సీబీ

26 May, 2022 00:23 IST|Sakshi
PC: IPL.Com

లక్నో ఔట్‌.. క్వాలిఫయర్‌-2కు ఆర్‌సీబీ
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ ​క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది. శుక్రవారం(మే 27న) రాజస్తాన్‌తో క్వాలిఫయర్‌-2లో అమితుమీ తేల్చుకోనుంది. ఇక ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది.  208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆఖరి వరకు పోరాడినప్పటికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 79 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగా తలా ఒక వికెట్‌ తీశారు.

కేఎల్‌ రాహుల్‌ (79) ఔట్‌.. 
79 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో షాబాజ్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ...15 ఓవర్లలో 144/3  
15 ఓవర్ల ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ 3 వికెట్లను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న దీపక్‌ హుడా వికెట్‌ను హసరంగా దక్కించుకున్నాడు.   

9 ఓవర్లలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 84/2
►9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 34, దీపక్‌ హుడా 17 పరుగులతో ఆడుతున్నారు.

పోరాడుతున్న లక్నో.. 7 ఓవర్లలో 67/2
►భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 7 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 29 పరుగులు, దీపక్‌ హుడా 6 పరుగులతో ఆడుతున్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో.. డికాక్‌(6) ఔట్‌
►208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరు పరుగులు చేసిన డికాక్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో రెండడు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేసింది.

రజత్‌ పాటిదార్‌ సూపర్‌ సెంచరీ.. ఆర్‌సీబీ భారీ స్కోరు
►ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్‌డౌన్‌లో వచ్చిన రజత్‌ పాటిదార్‌ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 పరుగులతో సూపర్‌ సెంచరీతో మెరిశాడు. దినేశ్‌ కార్తిక్‌ చివర్లో 23 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్లందరు బారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆవేశ్‌ ఖాన్‌, మోసిన్‌ ఖాన్‌, రవి బిష్ణోయి, కృనాల్‌ పాం‍డ్యా తలా ఒక వికెట్‌ తీశారు.

మహిపాల్‌ లామ్రోర్‌(14) ఔట్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
►14 పరుగులు చేసిన మహిపాల్‌ లామ్రోర్‌ రవిబిష్ణోయి బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. పాటిదార్‌ 66, కార్తిక్‌ 5 పరుగులతో ఆడుతున్నారు.

పాటిదార్‌ ఫిప్టీ.. మ్యాక్స్‌వెల్‌(9) ఔట్‌
ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 9 పరుగులు చేసిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఎవిన్‌ లూయిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక రజత్‌ పాటిదార్‌ సూపర్‌ ఫిప్టీతో మెరిశాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో పాటిదార్‌ అర్థశతకం సాధించాడు. 11 ఓవర్లలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.

కోహ్లి(25) ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
►లక్నోతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కోహ్లి ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మోసిన్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. రజత్‌ పాటిదార్‌ 49, మ్యాక్స్‌వెల్‌ 1 పరుగుతో ఆడుతున్నారు.

డుప్లెసిస్‌ గోల్డెన్‌ డక్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
►ఆర్‌సీబీ కెప్టెన్‌ పాఫ్‌ డుప్లెసిస్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ వికెట్‌ నష్టానికి 4 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌
►ఐపీఎల్‌ 2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భాగంగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా 8 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌ నిర్ణీత ఓవర్లతోనే జరగనుంది.

వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం
► చిరుజల్లుల కారణంగా టాస్‌ కాస్త ఆలస్యం కానుంది.

ఆర్‌సీబీ వర్సెస్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌
►ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లోకి అడుగుపెట్టనుండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. కాగా క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌తో ఎలిమినేటర్‌ విజేత అమితుమీ తేల్చుకోనుంది.

లీగ్‌ దశలో లక్నో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 పరాజయాలతో మూడోస్థానంతో ప్లేఆఫ్‌ చేరుకోగా.. ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో  8 విజయాలు.. ఆరు పరాజయాలతో నాలుగో స్థానంతో అడుగుపెట్టింది. ఇక లీగ్‌ దశలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది.

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్

ఆర్‌సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

>
మరిన్ని వార్తలు