Muttiah Muralitharan Vs Marco Jansen: 'మైండ్‌ దొబ్బిందా.. ఆ బౌలింగ్‌ ఏంటి?'.. మురళీధరన్‌ ఆగ్రహం

28 Apr, 2022 09:27 IST|Sakshi
Courtesy: IPL Twitter

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ చెత్త బౌలింగ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అయితే ఆఖరి రెండు బంతులను రషీద్‌ ఖాన్‌ భారీ సిక్సర్లు సంధించాడు. ఇది జీర్ణించుకోలేని కోచ్‌ మురళీధరన్‌.. ''కీలక దశలో ఫుల్‌ లెంగ్త్‌ బంతులను వేయడం ఏంటని.. మైండ్‌ దొబ్బిందా.. అసలేం బౌలింగ్‌ చేస్తున్నాడు'' అంటూ బూతుపురాణం అందుకున్నాడు.

మార్కో జాన్సెన్‌పై కోపంతో మురళీధరన్‌ ఇచ్చిన రియాక్షన్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. వాస్తవానికి మార్కో జాన్సేన్ చివరి ఓవర్ బానే బౌలింగ్ చేశాడు. తన ప్లాన్ ప్రకారం.. ప్రతి బంతిలో వైవిధ్యత చూపించాడు. ఎగ్జిక్యూషన్ లోపం కొంత.. అలాగే రషీద్ ఖాన్ ఎటాకింగ్ కొంత అతని ప్లాన్‌ను పూర్తిగా చెడగొట్టాయి. తొలిబంతికి స్లో కట్టర్ వేశాడు.. కానీ దాన్ని తెవాతీయా సిక్సర్‌గా మలిచాడు.

ఆ తర్వాత కూడా జాన్సెన్‌ తన బౌలింగ్‌లో వైవిధ్యత చూపించాడు. వరుసగా వైడ్ యార్కర్, బౌన్సర్, స్ట్రెయిట్ యార్కర్, లో ఫుల్ టాస్ లాంటి వైవిధ్య భరిత బంతులు వేశాడు. అయితే రషీద్ ఖాన్‌ రూపంలో అతనికి పెద్ద సమస్య వచ్చి పడింది. గ్రహచారం బాగాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలోనే లక్ష్య చేధన సమయంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కో జాన్సెన్‌ చెత్త రికార్డును అందుకున్నాడు.

చదవండి: Marco Jansen: ఐపీఎల్‌ చరిత్రలో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ చెత్త రికార్డు

మరిన్ని వార్తలు