Jos Buttler: వారెవ్వా.. బట్లర్‌ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం!

28 May, 2022 11:31 IST|Sakshi
సెంచరీల వీరుడు జోస్‌ బట్లర్‌(PC: IPL/BCCI)

జోస్‌ బట్లర్‌.. ఐపీఎల్‌-2022లో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన ఈ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన పరుగులు 824! అత్యధిక స్కోరు 116! నాలుగు శతకాలు.. నాలుగు అర్ధ శతకాలు! 78 ఫోర్లు.. 45 సిక్సర్లు!

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్‌-2లో  ఈ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజస్తాన్‌ ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఆర్సీబీతో మ్యాచ్‌లో 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో సాధించిన బట్లర్‌ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. శతకంతో మెరిసి రాజస్తాన్‌కు మధుర జ్ఞాపకం అందించాడు. ఈ క్రమంలో ఈ ఇంగ్లండ్‌ ఆటగాడు అరుదైన రికార్డు నమోదు చేశాడు. 

​క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్లే ఆఫ్స్‌లో సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. క్వాలిఫైయర్‌-2లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌, మురళీవిజయ్‌ బట్లర్‌ కంటే ముందున్నారు.

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో సెంచరీలు నమోదు చేసింది వీరే!
వీరేంద్ర సెహ్వాగ్‌(పంజాబ్‌)- 122 పరుగులు- 2014 క్వాలిఫైయర్‌-2 సీఎస్‌కేపై
షేన్‌ వాట్సన్‌(సీఎస్‌కే)-117 పరుగులు- నాటౌట్‌- 2018 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఫైనల్‌లో
వృద్ధిమాన్‌ సాహా(పంజాబ్‌ కింగ్స్‌)- 115 పరుగులు- నాటౌట్‌- 2014 కేకేఆర్‌తో ఫైనల్లో
మురళీ విజయ్‌(సీఎస్‌కే)- 113 పరుగులు- 2012 క్వాలిఫైయర్‌-2- ఢిల్లీతో మ్యాచ్‌లో
రజత్‌ పాటిదార్‌(ఆర్సీబీ)- 112 నాటౌట్‌- ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై
జోస్‌ బట్లర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)- 106 పరుగులు నాటౌట్‌- క్వాలిఫైయర్‌-2లో ఆర్సీబీతో మ్యాచ్‌లో

చదవండి 👇
IPL 2022: ఐపీఎల్‌లో మహ్మద్‌ సిరాజ్‌ చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..!
Dussen Wife Joke On Jos Buttler: 'బట్లర్‌ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్‌ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు !

>
మరిన్ని వార్తలు