హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆర్సీబీ.. పరువు కాపాడుకునే పనిలో ముంబై.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

9 Apr, 2022 17:47 IST|Sakshi
Photo Courtesy: IPL

RCB VS MI: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 9) మరో బిగ్‌ ఫైట్‌ జ‌ర‌గ‌నుంది. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌ని ముంబై ఈ మ్యాచ్‌లో గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతుండగా.. 3 మ్యాచ్‌ల్లో 2 వరుస విజ‌యాలు సాధించిన ఆర్సీబీ హ్యాట్రిక్‌ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. 

క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జ‌ట్ల మ‌ధ్య గత రికార్డుల‌ను ప‌రిశీలిస్తే.. ముంబై ఇండియన్స్‌దే పైచేయిగా ఉంది. లీగ్‌ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 29 మ్యాచ్‌ల్లో ముంబై 17 మ్యాచ్‌ల్లో గెల‌వగా, ఆర్సీబీ 12 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధించింది. ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డిన గ‌త 5 సందర్భాల్లో ఆర్సీబీ 3 మ్యాచ్‌లో గెలుపొందగా, ముంబై రెండింటిలో విజయం సాధించింది. తాజా సీజన్‌లో ఇరు జట్ల బలాబలాలను విషయానికొస్తే.. ముంబైతో పోలిస్తే ఆర్సీబీ అన్ని విభాగాల్లో బలంగా ఉందని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌ విభాగం మరింత బలపడనుంది.

తుది జ‌ట్లు (అంచ‌నా):
ముంబై ఇండియ‌న్స్‌: ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), రోహిత్ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, అర్జున్ టెండూల్క‌ర్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి.

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్‌, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.
చదవండి: ఆ వెటరన్‌ ప్లేయర్‌ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం..!

 

మరిన్ని వార్తలు